ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘటితమవ్వాలి

ABN, First Publish Date - 2022-12-31T00:29:06+05:30

వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘటితం కావాలని, వీరతెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగించి.. కార్మిక సంక్షేమాన్ని మరించిన కేంద్రప్రభుత్వాన్ని గద్దె దించాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయరాఘవన పిలుపునిచ్చారు.

ప్రసంగిస్తున్న వ్య.కా.సం. జాతీయ అధ్యక్షుడు విజయరాఘవన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం

వీరతెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి

వ్యకాసం రాష్ట్ర మహాసభల్లో జాతీయ అధ్యక్షుడు విజయరాఘవన్‌

ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రారంభం

తరలొచ్చిన పలువురు జాతీయ, రాష్ట్ర ప్రతినిధులు

ఖమ్మం, డిసెంబరు 30 (ఆంఽధ్రజ్యోతిప్రతినిధి) : వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘటితం కావాలని, వీరతెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగించి.. కార్మిక సంక్షేమాన్ని మరించిన కేంద్రప్రభుత్వాన్ని గద్దె దించాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయరాఘవన పిలుపునిచ్చారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసనగర్‌ (భక్తరామదాసు కళాక్షేత్రం)లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం మాజీ అధ్యక్షుడు పి.సోమయ్య అరుణపతాకం ఎగురవేసి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మహాసభలను ప్రారంభించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ సంతాపం తీర్మానాలను ప్రవేశపెట్టిన అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నాగయ్య అధ్యక్షతన తొలిరోజు సమావేశాలు జరిగాయి. వ్యవసాయ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వ్యవసాయ కార్మిక సంక్షేమంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చసాగింది. అలాగే మహాసభల అనంతరం చేపట్టాల్సిన భవిష్యత కార్యచరణ పై వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమాలపై నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు అలాగే దేశంలో రాజకీయ విధానాలు గురించి కూడా చర్చించారు. ఈ సందర్భంగా విజయరాఘవన్‌ మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, మతోన్మాద చర్యలను అడ్డుకోవాలన్నారు. మోదీ పాలన ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. దేశంలో పేద, వెనుకబడిన వర్గాలు జీవనం సాగించే పరిస్థితి లేదని, లౌకిక విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కంకణబద్దులై కదలాలన్నారు. వామపక్ష పాలన ఉన్నది కాబట్టే కేరళ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్‌వనగా నిలిచిందని, భూసంస్కరణలు, భూపంపిణీ సాధ్యమైందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలపై అకృత్యాలు ఎక్కువయ్యాయని, తెలుగు రాష్ట్రాల్లో పేదల భూములు గుంజుకునే చర్యలు సాగుతున్నాయని గుర్తుచేశారు. ముదిగొండ భూ పోరాటంలో ఏడుగురు ప్రాణత్యాగం చేయడం ఉద్యమ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌ ప్రసంగిస్తూ దేశంలో ఎవరు ఏరంగంలో ఉన్నా వ్యవసాయ కార్మికుల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేయాలని, రైతు, కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా నిలబడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందనే వారికి ఖమ్మం సభ సమాధానం చెప్పిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులందరినీ ఐక్యం చేసి వారి సంక్షేమంకోసం ధృడమైన ప్రణాళికలతో ముందకుసాగుదామని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుడూ దున్నే వాడికి భూమి అని వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన పిలుపును విస్మరించి నేటిపాలకులు కార్పొరేట్‌ శక్తులకు భూమి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మార్కెటింగ్‌, ఎక్సైజ్‌ పన్నుల రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పదిశాతం వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలన్నారు. ఈమహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఉపాధ్యక్షులు విక్రమ్‌, కేరళ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చంద్రన, వ్యకాసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, సీఐటీయూఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జానవెస్లీ, స్కైలాబ్‌బాబు, గిరిజనసంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి తోట రమేష్‌, వ్యకాసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు, వేదగిరి శ్రీనివాసరావు సతీమణి కళావతి, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి నాయకులు రొడ్డా అంజయ్య, వేముల మహేందర్‌ జ్ఞాపకార్థం ఆ జిల్లా నాయకులు అమరజ్యోతిని తీసుకువచ్చి జాతీయ అధ్యక్షుడు విజయరాఘవనకు అందించారు.

Updated Date - 2022-12-31T00:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising