ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మంలో రౌడీరాజ్యం

ABN, First Publish Date - 2022-06-17T06:31:50+05:30

ఖమ్మంలో నియంతపాలన, రౌడీరాజ్యం కొనసాగుతోందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి పువ్వాడను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 96వ రోజు గురువారం చింతకాని మండలం నుంచి ధంసలాపురం వద్ద ఖమ్మం నగరంలోకి ప్రవేశించింది.

ఖె్ముం సభలో మాట్లాడుతున్న షర్మిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేసీఆర్‌ పెద్ద మోసగాడు : వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

 ఖమ్మం నగరంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర, బహిరంగసభ

ఖమ్మంసంక్షేమవిభాగం, జూలై 16: ఖమ్మంలో నియంతపాలన,  రౌడీరాజ్యం కొనసాగుతోందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి పువ్వాడను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 96వ రోజు గురువారం చింతకాని మండలం నుంచి ధంసలాపురం వద్ద ఖమ్మం నగరంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి సంబానినగర్‌, ముస్తఫానగర్‌, బోనకల్‌ క్రాస్‌రోడ్‌, జెడ్పీ సెంటర్‌, వైరారోడ్‌ మీదుగా షర్మిల పాత బస్టాండ్‌ వద్దకు చేరుకుని బహిరంగసభలో ప్రసగించారు. ఉద్యోగాల కోసం రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోని నాయకుడు కేసీఆర్‌ అని, తాను చేపట్టిన పాదయాత్రతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక మంత్రి పువ్వాడ అజయ్‌కు నిలకడలేదని, తొలుత కమ్యూనిస్టుగా, ఆ తర్వాత వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌, ఆ తర్వాత కాంగ్రెస్‌, చివరికి టీర్‌ఎస్‌లో చేరాడన్నారు. మంత్రి పదవికున్న విలువ, హోదా, హుందాతనం గురించి ఆయనకు తెలియదని, ఎన్ని ఆస్తులు సంపాదించినా, కబ్జాలుచేసినా అతడి ధనదాహం మాత్రం తీరడంలేదన్నారు. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడనే’ దానికి పువ్వాడ సరిగ్గా సరిపోతాడని ఎద్దేవా చేశారు. రోడ్లు, కాల్వలు, అసైన్డభూములను కబ్జాచేశాడని, ఒకప్పుడు ఇల్లులేనివ్యక్తి నేడు హైదరాబాదులోని శామీర్‌పేటలో వందల కోట్ల విలువైన ఆస్తులు, భూములు ఎలా సంపా దించాడో అర్థం చేసుకో వాలన్నారు. ఖమ్మంలో ఏకాంట్రాక్టు పనినైనా తానే చేయాల న్నట్టు అజయ్‌ ప్రవర్తన ఉందన్నా రు. నాలుగు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటే ఎలా అని ప్రశ్నించారు. అజయ్‌ రవా ణాశాఖ మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ అప్పులపాలై ందని, కార్మికులకు సంఘ మే లేకుండా చేసిన కంత్రీ మంత్రి అని మండిపడ్డారు. నగరంలో వైఎస్‌ఆర్‌టీపీ కార్యక ర్తలపై కేసులు పెట్టిస్తున్నారని, పార్టీ దిమ్మెలను, వైఎస్‌ విగ్రహాలను కూడా తీయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులును పనోళ్లుగా, కుక్కల్లా వాడుకోవడం మగతనంకాదని, ఒక రౌడీషటర్‌గా వ్యవహరించడం గొప్పతనం కాదన్నారు. కేసీఆర్‌ లాగానే ఆయన మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని దోచుకోవడం, దాచుకోవడం తప్ప వారికేమీ చేతకాదన్నారు.  16మంది సీఎంలు చేయనన్ని అప్పులు కేసీఆర్‌ ఒక్కరే చేశారని మండిపడ్డారు. ఈ సభలో షర్మిలతోపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌, బీరవల్లి శ్రీనివాసరెడ్డి, తుంపాల కృష్ణమోహన, పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

పరామర్శలు.. పలకరింపులు

దంసలాపురం వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహనికి పూలమాల వేసిన షర్మిల అక్కడి ప్రజలతో మాట్లాడారు. అనారోగ్యంతో మృతి చెందిన కర్రి సిల్వరాజ్‌ నివాసానికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ నుంచి సంబానినగర్‌, ముస్తఫాన గర్‌కు చేరుకుని ఆటో కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఖాకీ చొక్కా వేసుకొని ఆటో నడిపారు. అనంతరం సెయింట్‌మెరీస్‌ పాఠశాల వద్దకు చేరుకుని తిరిగి బోనకల్‌ క్రాస్‌రోడ్‌, జడ్పీ సెంటర్‌, వైరారోడ్‌ మీదుగా పాత బస్టాండ్‌కు చేరుకొని అక్కడ సభలో  ప్రసంగించారు.

నేటి పాదయాత్ర 

గురువారం రాత్రి ఖమ్మం నగరం రాజేంద్రనగర్‌ వద్ద బస చేసిన షర్మిల శుక్రవారం ఖమ్మం రూరల్‌ మండలంలోని వెంకటగిరి క్రాస్‌ రోడ్డు, చిన్నవెంకటగిరి మీదుగా ముదిగొండ మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మండలంలోని వెంకటాపురం, మేడేపల్లి, ధనియాల గూడెం, కట్టకూరు గ్రామాల మీదుగా మాధాపురం చేరుకుని ప్రజలతో మాటాముచ్చట నిర్వహించి.. అక్కడే రాత్రి బస చేస్తారు. 


Updated Date - 2022-06-17T06:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising