బీఆర్ఎస్ నేతలకు ఎంపీ నామ విందు
ABN, First Publish Date - 2022-12-15T01:06:16+05:30
దేశరాజధాని ఢిల్లీలో బుఽధవారం భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయ ప్రారంభ వేడుక అనంతరం ఆపార్టీ నేతలకు లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు విందు ఇచ్చారు.
ఢిల్లీలోని నివాసంలో కార్యక్రమం
సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధుల హాజరు
ఖమ్మం, డిసెంబరు14(ఆంధ్రజ్యోతిప్రతినిధి) : దేశరాజధాని ఢిల్లీలో బుఽధవారం భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయ ప్రారంభ వేడుక అనంతరం ఆపార్టీ నేతలకు లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం కేసీఆర్‌తోపాటు యూపీ, కర్ణాటక మాజీ సీఎంలు అఖిలే్షయాదవ్, కుమారస్వామి, జాతీయ రైతుసంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. వీరిలో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు మాలోత కవిత, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, రైతుసమన్వయసమితి కమిటీ సభ్యులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులున్నారు. ఈ నేపథ్యంలో నిమ నివాసం వద్ద సందడి కనిపించింది. అయితే ప్రస్తుతం లోక్‌సభా పక్ష నేతగా ఉన్న నామ నాగేశ్వరరావు బీఆర్‌ఎ్‌సలో కీలకపాత్ర పోషంచనున్నారని, ఆయనకు జాతీయ సమన్వయకర్తగా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ : ఎంపీ నామ
పార్టీ కార్యాలయ ప్రారంభంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని, అభివృద్ధి, సంక్షేమంలో కూడా తెలంగాణ మోడల్‌గా నిలుస్తుందన్నారు. దేశంలో రైతుసంఘాలు, రైతునాయకులు బీఆర్ఎస్ పార్టీపట్ల ఆసక్తి చూపుతున్నారని, పార్టీ కార్యాలయ ప్రారంభంలో రైతులు, రైతుసంఘాల నాయకులు పాల్గొనడమే అందుకు నిదర్శనమన్నారు. మోడల్‌గా నిలిచిన తెలంగాణను చూసి ప్రజలు ఆకర్షితలవుతున్నారని, బీఆర్‌ఎ్‌సతో దేశ ప్రగతి దూసుకుపోతుందన్నారు.
బీఆర్‌ఎ్‌సతో దేశానికి కొత్త వెలుగు : మంత్రి పువ్వాడ
బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశంలో నెలకొన్న చీకట్లు తొలిగి కొత్త వెలుగులు వచ్చాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వనుందని, సకలవర్గాల సంక్షేమం, దేశ సమగ్ర పరిపాలన అజెండాతో కేసీఆర్ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అనతికాలంలో అభివృద్ధికి మోడల్‌గా నిలిపారని, అదే స్ఫూర్తితో ఆయన దేశాన్ని కూడా ప్రగతిపథంలో ముందుంచుతారన్నారు.
Updated Date - 2022-12-15T01:06:17+05:30 IST