ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిరప పైరుకు వేరు తెగులు

ABN, First Publish Date - 2022-11-08T23:12:13+05:30

కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పైరుకు వేరుతెగులు ఆశించింది.

ఎండిపోతున్న మిరప చేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, నవంబరు 8: కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పైరుకు వేరుతెగులు ఆశించింది. దీంతో తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని బాధిత రైతులు అంటున్నారు. తెగులు తీవ్రత మండలంలోని దారుగాబంజరు, చిన్నకోరుకొండిలోని మిరప చేలల్లో ఎక్కువ ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో సూమారు ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఎకరానికి గాను రూ. 30 వేల పెట్టుబడులు పెట్టామని రైతులు అంటున్నారు. ప్రధానంగా తేజ రకం విత్తనం సాగు చేశారు. ప్రస్తుతం చేను కాపునకు వస్తున్న సమయంలో తెగులు ఆశించిందని దారుగ బంజరుకు చెందిన బాధిత రైతు మందడపు మురళి ఆంధ్రజ్యోతికి వివరించారు. తెగు లు వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. కాయ నల్లగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మిరప చేనులో నీరు తడి పెట్టగానే ఈ తెగులు విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని పలువురు రైతులు వాపోతున్నా రు. తాము ఎంతగా పై పాటుగా పురుగుల మందులు పిచికారీ చేసిన తెగులు అదుపులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి పంటదిగుబడి అయితే ఎకరానికి సగుటున 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉంది. ఈపరిస్థితుల్లో మూడు క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని దీంతో పెట్టుబడులు కూడా రాని పరిస్ధితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-08T23:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising