ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Puvvada: కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతారు..

ABN, First Publish Date - 2022-10-06T19:58:16+05:30

టీఆర్ఎస్ పార్టీ ఇక బిఆర్ఎస్‌ పార్టీగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం (Khammam): టీఆర్ఎస్ (TRS) పార్టీ ఇక బిఆర్‌ఎస్ (BRS), (భారత రాష్ట్ర సమితి)గా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే (KCR) జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని, దేశంలో మతం పేరుతో, కులం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తున్నారని, బుల్ డోజర్ పేరుతో రాజకీయ పార్టీలను దారిలో పెట్టుకునే ప్రయత్నం బీజేపీ (BJP) చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) పార్టీలో వాళ్ళకు వాళ్లే కొట్టుకుంటున్నారని, మత చాందస వాదులు దేశంలో చొరబడితే కనీసం స్పందించడం లేదన్నారు. ఈడి దాడులు పెరిగాయని, దాడులతో దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటోందన్నారు. దేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతారని, రాబోయే రోజుల్లో అనుకూల వాతావరణం ఉంటుందన్నారు.


తెలంగాణలో పచ్చని పైర్లు, రోడ్లు బాగా ఉన్నాయని, మహారాష్ట్రలో పచ్చని పైర్లు లేవని,  రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి పువ్వాడ అన్నారు. కర్ణాటకలో కూడా దళితులపై దాడులు పెరిగాయన్నారు. అంబేద్కర్ పేరును సచివాలయంకు పెట్టుకున్నామని, పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టమంటే కనీసం మాట్లాడ లేదని అన్నారు. దేవగౌడ, కుమార్ స్వామి లాంటి నేతలు తెలంగాణ మోడల్ అంటున్నారని, గుజరాత్‌లో కరెంటు కోతలు ఉన్నాయని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. బిఆర్‌ఎస్‌తో జాతీయ రాజకీయాలలో కొత్త మలుపు రాబోతుందని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-06T19:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising