కొర్రమీను పిల్లల ఉత్పత్తి సక్సెస్
ABN, First Publish Date - 2022-08-04T07:25:25+05:30
కొర్రమీను పిల్లల ఉత్పత్తి సక్సెస్
పైలెట్ ప్రాజెక్టుగా వైరాలో ప్రక్రియ
పరిశీలించిన కలెక్టర్, సిఫా శాస్త్రవేత్తలు
వైరా, ఆగస్టు 3: దక్షిణభారతదేశంలోనే తొలిసారిగా మూడేళ్ల కిందట వైరా మత్స్య విత్తనోత్పత్తి కేంద్రంలో కొర్రమీను చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలివ్వలేదు. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్ల పాటు కొర్రమీను పిల్లల ఉత్పత్తి, ప్రయోగం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఈ ఏడాది జూలై 4 నుంచి 9తేదీ వరకు ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న జాతీయ మంచినీటి చేపల ఉత్పత్తి కేంద్రం(సిఫా) సహకారంతో.. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొర్రమీను జాతికి చెందిన తెల్లచేపలకు ఇండ్సు బ్రీడింగ్ ప్రక్రియ ద్వారా విత్తన ప్రక్రియను చేపట్టి దాదాపు లక్షన్నర గుడ్ల ఉత్పత్తి సాధించారు. ఆ లక్షన్నర గుడ్ల నుంచి అధునాతన పద్ధతిలో యాజమాన్య ప్రక్రియ చేపట్టి దాదాపు 25వేల నుంచి 30వేల వరకు ఫింగర్లింగ్స్(40ఎంఎం)సైజు కొర్రమీను చేపపిల్లలను సాధించటం జరిగింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే కొర్రమీను పిల్లల ఉత్పత్తి సాధించిన ఘనత తెలంగాణకే దక్కిందని అధికారులు సగర్వంగా ప్రకటించారు. సిఫాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాజే్షకుమార్ కొర్రమీను పిల్లల ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షించారు. వైరా మత్స్యశాఖ అధికారి బెంజిమెన బుజ్జిబాబు ఈ ఉత్పత్తి ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. ్చిసబ్బంది మురళీ, గ్రీష్మా, లఘుపతి, కృష్ణ, అక్బర్, లక్ష్మణ్, రాము తదితరులు సహకరించారు. బుధవారం వైరాలో పర్యటించిన ఖమ్మం కలెక్టర్ వీపీ.గౌతమ్ ఈ మత్స్యశాఖ విత్తనోత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రంలోనే తొలిసారి వైరాలో సాధించిన కొర్రమీను పిల్లల ఉత్పత్తి గురించి సిఫా శాస్త్రవేత్త డాక్టర్ రాజే్షకుమార్, ఎఫ్డీవో బుజ్జిబాబు కలెక్టర్కు వివరించగా.. వారిని కలెక్టర్ అభినందించారు. రాష్ట్రంలోనే ఈ అరుదైన ఘనత సాధించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-08-04T07:25:25+05:30 IST