ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khammam: ఖమ్మం జిల్లాలో ఎలాంటి ఘటన జరిగిందో చూడండి.. విషయం తెలిసి ఊరోళ్లంతా అక్కడే..!

ABN, First Publish Date - 2022-09-13T03:36:07+05:30

ఓ యువకుడితో పెళ్లి కొరకు ఇద్దరు యువతులు పోటీ పడిన ఘటన మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతకాని(ఖమ్మం జిల్లా): ఓ యువకుడితో పెళ్లి కొరకు ఇద్దరు యువతులు పోటీ పడిన ఘటన మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాచర్ల రోహిణ్‌ అనే యువకుడు వరుసకు సోదరి అయ్యే అదే గ్రామానికి చెందిన యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ యువతితో పాటు రోహిణ్‌ తాను ఇంటర్‌ చదువుతున్నపుడు పరిచయం అయిన తల్లాడ మండలానికి చెందిన మరో యువతితో ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. సదరు యువకుడు ఇన్ని రోజులు ఒకరి ప్రేమ విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలా ఇద్దరితో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయాన్ని స్థానికులు ఇద్దరు యువతులకు తెలపడంతో గ్రామంలో ఉన్న యువతితో పాటు తల్లాడ నుంచి వచ్చిన యువతి ఇరువురూ తాను పెండ్లి చేసుకుంటానంటే... తాను చేసుకుంటానంటూ వాదులాడటంతో అక్కడ ఆందోళన నెలకొంది.


ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానంటూ తమను శారీరకంగా లొంగదీసుకున్నాడని, అబార్షన్లు సైతం చేయించాడని ఇద్దరు యువతులు తెలపడం గమనార్హం. నాలుగు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో గ్రామస్థులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో సమాచారం తెలసుకున్న పోలీసులు ముగ్గురిని స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-09-13T03:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising