ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లల కుటుంబాలకు అండగా కల్యాణలక్ష్మి

ABN, First Publish Date - 2022-09-09T04:42:34+05:30

ఆడపిల్లల కుటుంబాలకు అండగా కల్యాణలక్ష్మి

కల్యాణలక్ష్మి పత్రాలు అందిస్తున్న మంత్రి పువ్వాడ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

127మంది లబ్ధిదారులకు రూ.1.27కోట్ల చెక్కులు పంపిణీ

ఖమ్మంలో కొత్త పింఛనుదారులకు అర్హత పత్రాల అందజేత

లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి, కలెక్టర్‌

క్యాంపు కార్యాలయంలో ఘనంగా ‘మూడేళ్ల’ వేడుకలు

ఖమ్మం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఆడపిల్లల కుటుంబాలకు అండగా ఉండడమే కల్యాణలక్ష్మి పథకం లక్ష్యమని, దేశంలో ఈ తరహా పథకం ఎక్కడా అమలవడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంత్రిగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు మంత్రి పువ్వాడకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛను లబ్ధిదారులతో కలిసి మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సహపంక్తి భోజనంచేశారు. ఈ సందర్భంగా మంత్రి 127మంది లబ్ధిదారులకు రూ.1.27కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు చీరలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఎన్నో ఆటంకాలు ఎదురైనా సీఎం కేసీఆర్‌ సంక్షేమపథకాలను ఎక్కడా ఆపలేదని, కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమపథకాలు కొనసాగించిన ఘనత తమదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీవర్గాలతోపాటు అగ్రవర్ణాల పేదలకు సైతం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అందిస్తున్నామన్నారు. రూ.50వేలతో మొదలైన సాయం ఇప్పుడు రూ.లక్ష116లకు చేరిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛన్లుకూడా అందిస్తున్నామని, తెలంగాణలోని అన్నివర్గాల వారు సంతోషంగా ఉండాలన్నదే ఈప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం కొత్తగా ఆసరా పింఛన్లకు అర్హత పొందిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులకు మంజూరు పత్రాలను అందించారు. జిల్లాలో ఇప్పటికే 1.50లక్షలమందికి వివిధరకాల పింఛన్లు అందుతుండగా కొత్తగా 49వేలమందికి మంజూరు చేశామన్నారు. ఏడాదికి రూ.12వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చుచేయగా ఈఏడాది రూ.2500కోట్లు అదనంగా ప్రభుత్వం  భరిస్తోందని, దేశంలో ఇంత భారీగా పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. సాగు, తాగునీరు అందించడంతోపాటు రైతులకు రుణవిముక్తి, రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమాజోహర, కార్పొరేషన కమిషనర్‌ ఆదర్శసురభి, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌తోపాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న మంత్రి అజయ్‌ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధుల కోలాహలం మధ్య భారీకేక్‌ కట్‌ చేశారు. 

Updated Date - 2022-09-09T04:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising