ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జేవీఆర్‌ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం

ABN, First Publish Date - 2022-10-08T04:30:14+05:30

జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో 1976-79సంవత్సరానికి చెందిన మొదటి బ్యాచ్‌ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు.

జేవీఆర్‌ ప్రభుత్వ కళాశాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్యాతిథిగా హాజరుకానున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి

సత్తుపల్లి, అక్టోబర్‌ 7: జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో 1976-79సంవత్సరానికి చెందిన మొదటి బ్యాచ్‌ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య రానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ దారా కృష్ణారావు తెలిపారు.

జలగానికి నివాళులతో ప్రారంభం

జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ ప్రాంతంలో ప్రధానంగా విద్యాబుద్దులు నేర్పింది. 1976-79లో చదివిన పూర్వ విద్యార్ధులు ఏర్పాటుచేసే అపూర్వ సమ్మేళనం రెండు రోజుల పాటు సాగనుంది. తొలుత కళాశాల ఏర్పాటుకు అహర్నిసలు శ్రమించిన మాజీ ముఖ్యమంత్రి సర్ధార్‌ జలగం వెంగళరావు కాంస్య విగ్రహానికి (జేవీఆర్‌ పార్క్‌ వద్ద) నివాళులుతో శనివారం ప్రారంభం కానుంది. ఆదివారం వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యే పద్మశ్రీ వనజీవి రామయ్య ఉపన్యాసం,  అదేవిధంగా జలగం, ఉడతనేని, చిట్లూరి కుటుంబ సభ్యులకు సన్మానం, గిరిజా మనోహరబాయితో రాళ్లబండి కవితాప్రసాద్‌ స్మారక ఉపన్యాసం, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కి సన్మానోత్సవం ఉంటుంది. కళాశాలలో దివంగత అధ్యాపకులు, మిత్రులు, సిబ్బందికి నివాళులర్పించనున్నట్లు కో-కన్వీనర్లు ఏ.శేషగిరిరావు, బీ.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-10-08T04:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising