ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడవాలంటే నరకయాతనే..

ABN, First Publish Date - 2022-08-08T05:15:26+05:30

లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని ఎదురుగడ్డ గ్రామపంచాయతీ మీదుగా కారుకొండ, హేమచంద్రాపురం గ్రామపంచాయతీలతోపాటు ఇల్లెందు నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో బురదమయంగా మారి అధ్వానంగా తయారైంది

వర్షంతో గుంతలమయంగా ఎదురుగడ్డ ప్రధాన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధ్వానంగా ఎదురుగడ్డ ప్రధాన రహదారి

లక్ష్మిదేవిపల్లి, ఆగస్టు 7: లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని ఎదురుగడ్డ గ్రామపంచాయతీ మీదుగా కారుకొండ, హేమచంద్రాపురం గ్రామపంచాయతీలతోపాటు ఇల్లెందు నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో బురదమయంగా మారి అధ్వానంగా తయారైంది. ప్రధాన మైన ఈ రహదారిపై ద్విచక్రవాహనాలతోపాటు భారీ వాహనాలు సైతం ప్రయాణిస్తుంటాయి. కురుస్తున్న వర్షాలతో ప్రధానమైన రహదారి మరమ్మతులకు గురైంది. నడవటానికే నరకయాతనగా తయారైంది. నిత్యం రద్దీగా ఉండే వాహనాలతో ఈ రహదారి ప్రయాణీకులకు ప్రాణసంకటగా మారింది. రోడ్డు మొత్తం బురదమయంగా మారడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే సందర్భాలు అనేకం. ఈ రోడ్డు సమస్య పట్టించుకునే వారు లేకపోవడంతో వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిని మరమ్మతులు చేసేందుకు ఎదురుగడ్డ పంచాయతీకి, కొత్తగూడెం మునిసిపాలిటికి హద్దుల సమస్య ఆటంకంగా మారిందని స్థానికులు ఆరోపిస్తోన్నారు. అధికారులు తమది కాదంటే.. తమది కాదని.. రోడ్డు మరమ్మతులను గాలికి వదిలేయడంతో వాహనదారులకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పల్లెప్రగతిలో కూడా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైన అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-08-08T05:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising