ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిలో ఆన్నీ ఉన్నా

ABN, First Publish Date - 2022-12-12T23:15:16+05:30

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిం చేందుకు సదుపాయాలు ఉన్నా రోగులకు సరైన చికిత్సలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది కరవయ్యారు.

చింతకాని ప్రభుత్వ ఆసుపత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతకాని డిసెంబరు 12: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిం చేందుకు సదుపాయాలు ఉన్నా రోగులకు సరైన చికిత్సలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది కరవయ్యారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి బదిలీ అయి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా నేటి వరకు జిల్లా ఉన్నతాధికారులు మండలానికి వైద్యాధికారిని నియమించకపోవడంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడంలేదు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు మండల వైద్యాధికారులు పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం బోనకల్‌ మండలానికి చెందిన వైద్యుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ ఇన్‌చార్జిగా ఉన్నాడు. ఆయనకు చదివేందుకు పీజీ సీటు రావడంతో సెలవు పెట్టే అవకాశం ఉన్నది. మరో వైద్యురాలు గర్భిణి కావడంతో ప్రసూతి సెలవులపై వెళ్లే అవకాశం ఉన్నది. దీంతో కనీసం ఇన్‌చార్జ్‌ వైద్యాధికారులు కూడా లేకపోయే అవకాశం ఉన్నది. దీంతో పాటు ఐదు హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, ఒక ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉన్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసర వైద్యానికి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే దిక్కవడంతో ఆరోగ్య కేంద్రంలో రెగ్యూలర్‌ వైద్యుడు లేకపోవడంతో ఇటీవల కాలంలో దవాఖా నాలకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రెగ్యూలర్‌ మండల వైద్యాధికా రులను నియమించి పూర్తి వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T23:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising