ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణుగూరు కోర్టును సందర్శించిన న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-11-27T23:02:09+05:30

మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటీవ్‌ న్యాయమూర్తి డాక్టర్‌ రాధా రాణి, ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి పసుపు లేటి చంద్రశేఖర్‌ ప్రసాద్‌ ఆదివారం సందర్శించారు.

న్యాయవాదులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణుగూరు, నవంబరు 27: మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటీవ్‌ న్యాయమూర్తి డాక్టర్‌ రాధా రాణి, ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి పసుపు లేటి చంద్రశేఖర్‌ ప్రసాద్‌ ఆదివారం సందర్శించారు. రాధా రాణికి మణుగూరు మెజిస్ట్రేట్‌ వెంకటేశ్వర్లు, బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు కుర్మ విజయరావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ రాధారాణి మణుగూరు సబ్‌ డివిజన్‌ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు. కోర్టు భవనం పరిశీలించి అసోసి యేషన్‌ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయరావు కోర్టు భవనంలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, కక్షిదారుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు మొబై ల్‌ కోర్టు, ఎగ్జిక్యూటీవ్‌ జిల్లా కోర్టులలో శిక్షణ పొం దిన జ్యుడిషియల్‌ అధికారులను నియమించేలా చర్యలు చేప ట్టాలని కోరారు. సమస్యలపై స్పందించిన జస్టీస్‌ రాధారాణి పది రోజుల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు కృషిచేస్తామని, మౌళిక సదుపాయాల విషయంలో సమస్యలను విడివిడిగా నివేదిస్తూ వినతులు ఇవ్వాలన్నారు.

Updated Date - 2022-11-27T23:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising