ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను దగా చేస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-06-25T06:05:25+05:30

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పేద ప్రజలను దగా చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంబాని చంద్రశేఖర్‌ విమర్శించారు.

రచ్చబండ సభలో ప్రసంగిస్తున్న సంబాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంబాని

కల్లూరు, జూన్‌ 24 :కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పేద ప్రజలను దగా చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంబాని చంద్రశేఖర్‌ విమర్శించారు. కల్లూరు మండలంలోని కొర్లగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన  కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమం సభలో ఆయన ప్రసంగించారు. రైతులను ఆదుకోవటంలో కేంద్రంలో రైతువ్యతిరేక చట్టాలు తీసుకొవచ్చిన బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో దళారీల వ్యవస్థను తీసుకోవచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరస్పర నిందలతో కాలం గడుపుతూ రైతులకు ఆన్యాయం చేశాయని అన్నారు. సైన్యంలో నియామకల విషయంలో అగ్నిపఽథ్‌ చట్టంను తీసువచ్చి ఉద్యోగ భద్రత లేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా  ప్రభుత్వాల విధానాల ఫలితంగా నిత్యవసరాలు పెరి గి పేదలపై ఆర్థిక భారం పడిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాం జరుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు అందాల్సిన సంక్షేమ పఽథకాలను ముందుకు సాగకుండా తొక్కిపట్టిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, రాష్ట్రంలో నియంత పాలన సాగిసున్న టీఆర్‌ఎస్‌ లాంటి ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు, ప్రజా సంక్షేమాన్ని కోరుకొనే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్‌తో పాటుగా వేంసూరు,తల్లాడ, పెనుబల్లి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, గోళ్ల అప్పారావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దగ్గుల రఘుపతి రెడ్డి, బైరెడ్డి మనోహరరెడ్డి, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు మనోహరనాయుడు, ఎంపీటీసీలు కొండూరి కిరణ్‌కుమార్‌ ,మాదిరాజు లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ జె గోపాలస్వామి, జె కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising