ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికా సాధికారితతోనే సుస్థిర అభివృద్ధి

ABN, First Publish Date - 2022-10-12T04:44:55+05:30

బాలికా సాధికారితతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ గుంటుపల్లి భారతారాణి అన్నారు.

మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ భారతారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ గుంటుపల్లి భారతారాణి

ముదిగొండ, అక్టోబరు 11: బాలికా సాధికారితతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ గుంటుపల్లి భారతారాణి అన్నారు. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం కేజీబీవీ పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులు బాలికలు, మహిళలకు సానుకూలంగా లేవని, నిత్యం బాలికలపై యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని అధిగమించి బాలికలు మనోధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మదర్‌థెరిస్సా, దుర్గాబాయిదేశ్‌ముఖ్‌, సావిత్రిబాయిపూలే, కస్తూర్బా వంటి వారిని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. కార్యక్రమంలో 1098 జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఏహెచ్‌టీయూ బాధ్యుడు నర్సింహారావు, ఎంపీటీసీ మాధవి, స్పెషలాఫీసర్‌ ఇందిర, అనూష, గురుమూర్తి, నరేందర్‌, మౌనిక పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T04:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising