ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-12-15T22:43:43+05:30

అటవీ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తోందని అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ ఒంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. రూ.1.46 కోట్ల నిధులతో సత్తుపల్లి డివిజన్‌ కాంప్లెక్స్‌లో చేపట్టిన డీఎం, పీఎం కార్యాలయాలు, డీఎం, పీఎం క్వార్టర్ల పునఃనిర్మాణానికి వైస్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ జీ.చంద్రశేఖరరెడ్డి (ఐఎఫ్‌ఎస్‌)తో కలసి ఆయన భూమిపూజ చేశారు. యూకలిప్టస్‌ను పెంచే సంప్రదాయ పద్ధతుల నుంచి ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా మార్పు చెందాలన్నారు.

అధికారులకు పలు సూచనలిస్తున్న ఛైర్మన్‌ ప్రతాపరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లి, డిసెంబరు 15: అటవీ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తోందని అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ ఒంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. రూ.1.46 కోట్ల నిధులతో సత్తుపల్లి డివిజన్‌ కాంప్లెక్స్‌లో చేపట్టిన డీఎం, పీఎం కార్యాలయాలు, డీఎం, పీఎం క్వార్టర్ల పునఃనిర్మాణానికి వైస్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ జీ.చంద్రశేఖరరెడ్డి (ఐఎఫ్‌ఎస్‌)తో కలసి ఆయన భూమిపూజ చేశారు. యూకలిప్టస్‌ను పెంచే సంప్రదాయ పద్ధతుల నుంచి ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా మార్పు చెందాలన్నారు.

విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రం

నియంత్రిత పంటల సాగుతో రైతు అభివృద్ధితో పాటు భూమిలో సారం పెరుగుతుందని, ప్రపంచంలోనే విత్తన భాండాగారంగా తెలంగాణను చూడాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని ప్రతాప్‌రెడ్డి అన్నారు. అధికారులు సూచించిన పంటలు వేసి అధికా రాబడి రైతులు సాధించాలని, ఇందుకు ముఖ్యంగా 10 లక్షల ఎకరాలలో చేపట్టిన పామాయిల్‌ సాగే నిదర్శనమన్నారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బంది బాగోగులు అడిగి తెలుసుకుని టింబర్‌ డిపోను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌, ఎకో-టూరిజం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ.స్కైలాబ్‌, సత్తుపల్లి, కొత్తగూడెం డివిజనల్‌ మేనేజర్లు వి.తనూజ, జీ.చంద్రమోహన్‌, రేంజర్లు బీ.సైదానాయక్‌, జీ.గణేష్‌, ఎస్‌.నాగరాజు, డీపీఎం నాగలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising