ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌సీ కోసం ఐదుగంటలపాటు నిరీక్షణ

ABN, First Publish Date - 2022-12-05T00:11:06+05:30

విద్యుత్‌ శాఖలోని కొన్ని పనులు చేయడానికి దానికి తగ్గట్టుగా లైన్‌క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకుని పనులు నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో సిబ్బంది ప్రాణాలకు పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ పనులు నిర్వహించే విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల చెప్పిన ప్పటికి వారి మాటలు పెడచెవిన పెట్టాడు. ఎవరైతే నాకేంటి అంటూ ఐదుగంటలపాటు వినియోగదారుడిని ఇబ్బందులకు గురిచేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినియోగదారుడు, కాంట్రాక్టర్‌తో వాగ్వాదం

ఖమ్మం, డిసెంబరు4(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖలోని కొన్ని పనులు చేయడానికి దానికి తగ్గట్టుగా లైన్‌క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకుని పనులు నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో సిబ్బంది ప్రాణాలకు పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ పనులు నిర్వహించే విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల చెప్పిన ప్పటికి వారి మాటలు పెడచెవిన పెట్టాడు. ఎవరైతే నాకేంటి అంటూ ఐదుగంటలపాటు వినియోగదారుడిని ఇబ్బందులకు గురిచేశాడు. ఇదంతా కేవలం ఎల్‌సీ తీసుకో వడానికే.. కైకొండాయిగూడెం పరిధిలో ఓ వినియోగ దారుడు నవంబరులో విద్యుత్‌ స్థంభం కోసం దరఖాస్తు చేశాడు. ఇందుకోసం నగదు సైతం చెల్లించాడు. ఆదివారం ఉన్నతాధికారులు చెప్పడంతో ఓ కాంట్రాక్టర్‌ స్థంభం ఏర్పాటు చేసేందుకు అక్కడకు వచ్చాడు. ఆయన పనులు చేసుకునేందుకు ఎల్‌సీ ఇవ్వకుండా అడ్డుకున్నాడు ఓ ఉద్యోగి. గంటల తరబడి సంబంధిత స్థలానికి వెళ్లకుండా తాత్సారం చేశాడు. ఉదయం 10 గంటల నుంచి వినియోగదారుడిని, కాంట్రాక్టర్‌ను అక్కడ నిలబెట్టిన సదరు ఉద్యోగి మధ్యాహ్నం వేళ 3 గంటల సమయంలో అక్కడకు వెళ్లి వినియోగదారుడితో ఇష్టారీతిన ప్రవర్తించడం తోపాటు, కాంట్రాక్టర్‌తో వాగ్వివాదానికి దిగాడు. పని చేయకుండా పంపేశాడు. తమకు దిక్కున్నచోటు చెప్పుకోమంటూ ఎల్‌సీ ఇచ్చేందుకు ససేమీరా అన్నాడు. వినియోగదారుడు నగదు చెల్లించినప్పటకీ స్థంభం వేయకుండా అడ్డుకోవడంపై మామూళ్లు ముట్టని కారణంగానే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు కోరుతున్నారు.

Updated Date - 2022-12-05T00:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising