ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్న ఒక్కరూ వెళ్లిపోయారు!

ABN, First Publish Date - 2022-10-08T05:11:55+05:30

ఉన్న ఒక్కరూ వెళ్లిపోయారు!

ఆరు నెలలుగా మూసి ఉన్న స్కానింగ్‌ గది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12మంది ప్రసూతి వైద్యులకు ఒక్కరూ లేని వైనం

భద్రాచలం ఏరియా వైద్యశాలలో గర్భిణులకు అందని వైద్యం 

ఆరు నెలలుగా తెరుచుకోని స్కానింగ్‌ విభాగం

భద్రాచలం, అక్టోబరు 7: నాలుగు రాషా్ట్రల సరిహద్దులో ఉన్న భద్రాచలం ఏరియావైద్యశాల నిరుపేద గర్భిణులకు పెద్దదిక్కు. పేరుకు 200 పడకల ఆసుపత్రి అయినా ఇక్కడ వైద్యుల కొరత తీవ్రంగా ఉంటుంది. ఎంతో కీలకమైన ప్రసూతి విభాగానికి మొత్తం 12మంది వైద్యులు అవసరం కాగా.. ఆరునెలలుగా ఒకే ఒక గైనకాలజిస్టు ఉన్నారు. ఆయన కూడా గురువారం వెళ్లిపోయారు. దీంతో పెద్దాసుపత్రికి ప్రసవం కోసం వచ్చే వారికి వైద్య సేవలు కష్టతరమయ్యాయి. ఇందుకు తాజాగా వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు గర్భిణులను మెరుగైన వైద్యశాలలకు రిఫర్‌ చేయడమే నిదర్శనం. డివిజన కేంద్రమైన ఏజెన్సీలోని పెద్దాసుపత్రిలో వైద్యుల సమస్య ఇంతలా వేధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపులేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా తెలంగాణ వైద్యవిధాన విధాపరిషత పరిధిలోని వైద్యశాలల్లో వైద్యుల సమస్య లేదని సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  ప్రకటించగా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి వైద్యశాలలో ఆరు నెలలుగా గైనకాలజీ విభాగాన్ని నిర్వహిస్తున్న వైద్యుడికి ప్రత్యామ్నాయంగా కనీసం మరో గైనకాలజిస్టును కూడా నియమించకపోవడంతో  తీవ్రమైన పని ఒత్తిడికి ఆయన గురయ్యారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన తానిక్కడ పని చేయలేనంటూ ఛత్తీ్‌సగఢ్‌లో బాధ్యతలు నిర్వహించేందుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 


12మందికి ఒక్కరూ లేని వైనం.. 

భద్రాద్రి వైద్యశాల 200 పడకల వైద్యశాల కావడంతో వాస్తవానికి 12 మంది గైనకాలజిస్టులను నియమించాల్సి ఉంది. కానీ వంద పడకల వైద్యశాలకు ఉన్న విధంగానే ఆరుగురు గైనకాలజిస్టు పోస్టులే ఇటీవల వరకు కొనసాగుతున్నాయి. అయితే వైద్యశాలలో కాంట్రాక్టు గైనకాలజిస్టులుగా బాధ్యతలు నిర్వహించిన వైద్యులు సొంతంగా క్లినిక్‌లు పెట్టుకొని వెళ్లిపోవడం, డిప్యూటేషన్‌పై నియమితులైన వారు కొద్దికాలం పాటు పనిచేసి ఇతర కారణాలతో వెళ్లిపోయారు. దీంతో ఆరు నెలలుగా గైనకాలజీ విభాగాన్ని సీనియర్‌ గైనకాలజిస్టే నిర్వహిస్తున్నారు. గతంలో నలుగురు గైనకాలజిస్టులు బాధ్యతలు నిర్వహించిన సమయంలో 650 ప్రసవాలు ప్రతీ నెల భద్రాద్రి వైద్యశాలలో జరిగేవి. దీంతో భద్రాద్రి వైద్యశాల రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఇటీవల కాలంలో గైనకాజలిస్టుల కొరత వెంటాడుతుండటంతో ప్రస్తుతం 300 నుంచి 350 వరకు ప్రసవాలు నిర్వహిస్తున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటి వరకు పని చేసిన గైనకాలజిస్టు ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ ప్రత్యేక చొరవతో పని చేశారు. ప్రత్యామ్నాయంగా మరో గైనకాలజిస్టు నియమాకంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి వెళ్లినా ఉదాసీనంగా వ్యవహరించడంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్లిపోయినట్టు ప్రచారం సాగుతోంది. 


నిరుపేద గర్భిణులకు వైద్య కష్టాలు..

ఏజెన్సీలోని నిరుపేద గర్భిణులు ప్రసవంకోసం భద్రాచలం ఏరియా వైద్యశాలను ఆశ్రయిస్తుంటారు.అలాంటి వైద్యశాలలో గైనకాలజిసస్టులు లేకపోవడంతో వారికి వైద్యం ఇకపై పూర్తిస్థాయిలో అందుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పది రోజులుగా తీవ్ర ఇబ్బందుల మధ్య వైద్యశాలలోని గైనకాలజీ విభాగంలో గర్భిణులు, బాలింతలకు సేవలందించినట్లు తెలుస్తోంది. భద్రాచలం ఏజెన్సీతో పాటు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశలోని పోలవరం ముంపు మండలాలు, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గర్భిణులు ప్రసవం కోసం భద్రాద్రి వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో శస్త్రచికిత్స, ఇతరత్రా వైద్య సదుపాయాలు అవసరమైన గర్భిణులను ఇతర ప్రాంతాలకు పంపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి  వరకు పని చేసిన గైనకాలజిస్టు వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని కలెక్టరు, డీసీహెచఎ్‌స, వైద్యవిధానపరిసత కమిషనర్‌కు నివేదించామని ఏరియా వైద్యశాల అధికారులు చెబుతున్నారు.  ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య కమిషనర్‌, మంత్రితో మాట్లాడి గైనకాలజిస్టుల నిమామకానికి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా ఆరు నెలలుగా ఏరియా వైద్యశాలలోని స్కానింగ్‌ విభాగం తలుపులు కూడా తీయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇక్కడ పని చేయడానికి రేడియాలజిస్టులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులకు స్కానింగ్‌ నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో వారిని బయటకు రిఫర్‌ చేస్తుండటంతో రూ.1000వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఐటీడీఏ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టిసారించకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన, నిరుపేద మహిళలకు స్కానింగ్‌ అందుబాటులో లేకపోవడంతో బయట స్కానింగ్‌ నిర్వహించాల్సి వస్తోంది.

Updated Date - 2022-10-08T05:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising