ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు

ABN, First Publish Date - 2022-05-17T05:16:58+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలలోని అన్ని శాఖలకు సంబందించి పనులను పెండింగ్‌ లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

కలకోట గ్రామంలో తీగలు వదులుగా ఉన్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒరిగిన  స్తంభాలు, తీగలతో అవస్థలు

 లో వోల్టేజీతో సమస్యలు

 పరిష్కారం కోసం ప్రజల ఎదురుచూపు

 20నుంచి ‘పల్లెప్రగతి’ కార్యక్రమం

బోనకల్‌, మే 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలలోని అన్ని శాఖలకు సంబందించి పనులను పెండింగ్‌ లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అవసరమైన పనులను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు అంచనాలను వేసి ఉన్నతాధికారులకు పంపించారు. అందులో కొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు మాత్రం మిగిలి ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించనున్న ‘పల్లెప్రగతి’లో విద్యుత్‌ సమస్యల పరిష్కారం జరిగేనా? అని ప్రజాప్రతినిధులు ఆశతో ఎదురు చూస్తున్నారు.


గ్రామాల్లో ప్రధాన సమస్యలు


ప్రధానంగా కలకోట గ్రామంలో బీసీ, ఎస్సీ కాలనీల్లో పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు ఒరిగాయి. తీగలు వదులుగా ఉండటంతో గాలి దుమారానికి ఇళ్లకు తగిలి విద్యుత్‌ ప్రసారం అవుతుందని ప్రజలు వాపోతున్నారు. చెరువు బజార్‌లో విద్యుత్‌ స్తంభాన్ని ట్రాక్టర్‌ డీకొట్టడం వలన స్తంభం విరిగి ఓ ఇంటి పై పడింది. ఇంట్లో ఎవ్వరు లేక పోవడంతో ఇప్పటికి ఆ ఫోల్‌ అంతే ఉంది. దానికి ఉన్న విద్యుత్‌ వైర్లు కిందకు రావడంతో అటుగా వస్తున్న ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది.

బ్రాహ్మణపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ కొరత వలన లో వోల్టేజీ వస్తుందని, విద్యుత్‌ స్థంబాలు అవసరం ఉందని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆళ్లపాడులో విద్యుత్‌ తీగలు చేతి కందే ఎత్తులో ఉండటంతో రానున్న వర్షకాలంలో గాలి వానలకు విద్యుత్‌ ప్రసారం జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు.

బోనకల్‌లో కూడ మరికొన్ని విద్యుత్‌ స్థంబాలు, వదులుగా ఉన్న తీగలను సరి చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 చొప్పకట్లపాలెంలో నాలుగు దశాబ్ధాలుగా బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్థబాల కేబుల్‌ కాలం పూర్తైనా కొత్త తీగలను వేయలేదు. దింతో గాలి దూమారం వచ్చినప్పుడల్లా విద్యుత్‌ ట్రిప్‌ అవుతుంది. శ్మశాన వాటిక వరకు స్థంబాల అవసరం ఉంది. చిరునోముల నుంచి చొప్పకట్లపాలెం గ్రామానికి వచ్చే విద్యుత్‌ సరఫరా తీగలు సుబాబుల్‌ పోలాల్లో తరుచు ట్రిప్‌ అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున శాశ్వత పరిష్కారం చూయించాలని కోరుతున్నారు. ఇలా పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. సమస్యల పై విద్యుత్‌శాఖ ఏఈ ఉమామహేశ్వరావును వివరణ కోరగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేలా చూస్తామని తెలిపారు.


విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి

యంగల దయామణి, సర్పంచ్‌, కలకోట


పల్లె ప్రగతిలో విద్యుత్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలి. గ్రామంలో వదులుగా ఉన్న విద్యుత్‌ తీగల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరం ఉన్న చోట విద్యుత్‌ స్థంబాలను ఏర్పాటు చేయడంతో పాటు ఒరిగిన స్తంభాలను సరి చేయాలి.


బీసీ కాలనీలో కొత్త కేబుల్‌ను వేయాలి

ఎర్రంశెట్టి సుబ్బారావు, సర్పంచ్‌, చొప్పకట్లపాలెం


బీసీ కాలని ఏర్పాటు జరిగి దాదాపు 40 ఏళ్లు అయింది. ఇంత వరకు కొత్త కేబుల్‌ వేయలేదు. దింతో గాలి దూమారం వచ్చినపుడు విద్యుత్‌ సమస్యలు వస్తున్నాయి. బీసీ కాలనీలో విద్యుత్‌ స్థంబాల మద్య కొత్త కేబుల్‌ వేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. కొన్ని విద్యుత్‌ స్తంభాలు అవసరం ఉంది.


వేసవిలోనే మరమ్మతు పనులను పూర్తి చేయాలి

మర్రి తిరుపతిరావు, సర్పంచ్‌ ఆళ్లపాడు


రానున్న వర్షకాలంను దృష్టిలో ఉంచుకొని వేసవిలోనే విద్యుత్‌ లైన్ల మరమ్మతు పనులను పూర్తి చేయాలి. స్తంబాల మధ్య వదులుగా ఉన్న తీగల వలన ఇళ్లకు విద్యుత్‌ ప్రసారం వస్తుందన్న భయం గ్రామంలో నెలకొంది. మూడవ కేబుల్‌ను ఇవ్వాలి. విద్యుత్‌ స్తంబాలను కావాల్సిన చోటకు జాప్యం లేకుండా మంజూరు చేయాలి.



Updated Date - 2022-05-17T05:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising