ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వోడీల పేరుతో విధులకు డుమ్మా

ABN, First Publish Date - 2022-03-06T04:40:04+05:30

ఓడీల పేరుతో ఓ జిల్లా పరిషత్‌ పాఠశాల హెచ్‌ఎం విధులకు డుమ్మా కొట్టింది.

పాఠశాలలో రిజిస్టర్‌ను తనిఖీ చేస్తున్న డీఈఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కొమ్మినేపల్లి పాఠశాలలో హెచ్‌ఎం నిర్వాహకం

  డీఈవో ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి

  హెచ్‌ఎంకు షోకజ్‌ నోటీస్‌ జారీ

కామేపల్లి, మార్చి5: ఓడీల పేరుతో ఓ జిల్లా పరిషత్‌ పాఠశాల హెచ్‌ఎం విధులకు డుమ్మా కొట్టింది. కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న తేజశ్రీ ఓడీల పేరుతో విధులు గైర్హాజరువుతుందని తెలుసుకున్న డీఈవో యాదయ్య శనివారం పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో హెచ్‌ఎం తేజశ్రీ విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రిజిస్టర్‌ హెచ్‌ఎం తేజశ్రీ పేరు దగ్గర ఓడీగా రాసి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఫోన్‌ ద్వారా ఎక్కడి వెళ్లారు అని ప్రశ్నించారు. పని నిమిత్తం బయటకు వెళ్లానని తెలిపారు. పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌, సబార్డీనేట్‌ ఉండగా బయట పనులకు మీరు ఎందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న హెచ్‌ఎం తేజశ్రీకు షోకజ్‌ నోటీస్‌ జారీ చేశారు. గత నెలలో పాఠశాలల కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించిన సమయంలో విద్యార్థుల హాజరు శాతం తక్కుగా ఉండడంతో కలెక్టర్‌ గౌతమ్‌ ఆరోజు షోకజ్‌ నోటీస్‌ జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఐనప్పటికీ ఉపాధ్యాయుల్లో మార్పు రావటం లేదు.


Updated Date - 2022-03-06T04:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising