డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షనప్లాన
ABN, First Publish Date - 2022-03-05T07:45:38+05:30
డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షనప్లాన
వీడియో కాన్ఫరెన్సలో ఐజీపీ రాజేష్‌కుమార్
ఖమ్మం, మార్చి4(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియం త్రణకు ప్రత్యేక యాక్షనప్లానతో ముందుకు వెళ్తున్నట్టు ఐజీపీ రాజేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమరవాణాపై పోరాటాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో శుక్రవారం అన్ని జిల్లాల పోలీస్ కమీ షనర్లు, ఎస్పీలతో ఆయన వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. అంతరాష్ట్ర ముఠాలతో సహా గతంలో అరెస్టయిన వ్యక్తుల పాత్ర, ఇతర ముఠాలతో ఉన్న సంబంధాలు, నేరాలు, వారి కార్యనిర్వహణ పద్ధతిని ట్రాక్ చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. మాదకద్రవ్యాల నేరస్థుల కట్టడి సులభతరం చేసేందుకు పోలీస్ శాఖకు ఉన్న టెక్నాల జీకి మరింత జోడించి దూకుడు పెంచాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఎనడీపీఎస్ యాక్ట్ కేసుల పర్యవేక్షణను వేదికగా చేసుకుని మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు, హాట్‌స్పాట్‌ల గుర్తింపు, ఇతర రాష్ట్రాల డ్రగ్స్, మాదకద్రవ్యాల నేరస్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గంజాయి నియంత్రించేందుకు జిల్లాలో చేపట్టిన ప్రణాళికను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ వివరించారు. వీడీయో కాన్ఫరెన్స లో డీసీపీ ఇంజరపు పూజ, అడిషనల్ డీసీపీ అడ్మిన గౌస్ ఆలమ్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్‌చంద్రబోస్, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T07:45:38+05:30 IST