ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుగంటిన పాలేరు

ABN, First Publish Date - 2022-06-26T06:12:21+05:30

అడుగంటిన పాలేరు

నీరులేక వెలవెలబోతున్న పాలేరు జలాశయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో అడుగు తగ్గితే తాగునీటి సరఫరా నిలిపివేత

కూసుమంచి, జూన్‌ 25: పాలేరు జలాశయం అడుగంటింది. గరిష్టనీటిమట్టం నీటిమట్టం 23 అడుగులకుగాను ప్రస్తుతం 11 అడుగులమేర నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం భగీరఽథ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు 100 క్యూసెక్కులు, సూర్యాపేట జిల్లాకు 100 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. కాగా జలాశయం నీటిమట్టం మరో అడుగు తగ్గితే ప్రాజెక్టుకు నీరందక తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. పాలేరు మినీహైడల్‌ పక్కన ఉన్న ప్రాజెక్టుకు, గుర్వాయిగూడెం వద్ద నిర్మితమై ఉన్న ప్రాజెక్టుకు నీరందడం కష్టమవుతుంది. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో సుమారు 73గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. పాలేరు జలాశయంలో నీటినిల్వలు తగ్గడంపై ఇప్పటికే ఐబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు భగీరఽథ ప్రాజెక్టు డీఈ మురళీకృష్ణ తెలిపారు. అయితే సాగర్‌ డ్యామ్‌నుంచి నీటి విడుదలకు మొదటిజోన్‌ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతుండటం వల్ల నీరు విడదల ఆలస్యం అవుతుందని తెలిపారు. మరోవారం పదిరోజుల్లో సాగర్‌ డ్యామ్‌నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 15రోజులపాటు నీటినిల్వలు సరిపోతాయని తెలిపారు.  

Updated Date - 2022-06-26T06:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising