ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి నిత్యన్నదాన పథకానికి విరాళాలు

ABN, First Publish Date - 2022-01-22T04:15:40+05:30

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిత్యన్నదాన పథకానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు అందించారు.

రామాలయ ఆవరణలో చెన్నై జీఎస్టీ కమిషనర్‌ కుటుంబం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వామిని దర్శించుకున్న చెన్నై జీఎస్టీ కమిషనర్‌

భద్రాచలం, జనవరి21: భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిత్యన్నదాన పథకానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ధూళిపూడి వెంకటసూర్యచంద్ర, ధనలక్ష్మి, విశాఖపట్నానికి చెందిన వుంగరాల ధనలక్ష్మి దంపతులు, కాకినాడకు చెందిన అడబాల భారతి దంపతులు రూ.1,03,000 చొప్పున విరాళం అందజేశారు. వీరు తొలుత ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విరాళాలను ఆలయ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌కు అందజేశారు. అదేవిధంగా చెన్నై జీఎస్టీ కమిషనర్‌ ఫణీంద్ర కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. 

శ్రీరామానుజ సహస్రాబ్ధి సమారోహానికి భద్రాద్రి వైదిక సిబ్బంది

 భద్రాచలం, జనవరి 21: హై దరాబాద్‌లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించే శ్రీ రామానుజ సహస్రాబ్ధి సమారోహ మహోత్సవాలకు భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం నుంచి వైదిక సిబ్బంది వెళ్లనున్నారు. వారికి 12 రోజుల పాటు డిప్యుటేషన్‌ పై పంపుతూ దేవాదాయ శాఖ కమీషనర్‌ బి.అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేద పండితులు చిట్టి హనుమత్‌శాస్త్రి, ఎల్‌ఆర్‌కే ప్రసాద్‌ అవధాని, గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు కేవీకేఎస్‌ కామేశ్వర శర్మ, మల్లూరి రవికుమార్‌ శర్మ ఉన్నారు. దేవస్థానం పురోహితులు చెన్నావజ్జుల వెంకటేశ్వర అవధాని, ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉపప్రధాన అర్చకులు అమరవాది గోపాలకృష్ణమాచార్యులు,  కోటి శ్రీమన్నారాయాణాచార్యులు, అమరవాది శేష గోపాలాచార్యులు, అమరవాది వెంకట రామా నుజాచార్యులు, ముఖ్యఅర్చకులు అమరవాది మధుసూదనాచార్యులు, అర్చకులు సౌమిత్రి శ్రీనివాసా చార్యులు, కందాల శ్రవణ్‌కుమారాచార్యులు, కారంపూడి కిరణ్‌కుమారాచార్యులు, పొడిచేటి రామ భద్రాచార్యులు, కోటి విష్ణువర్దనాచార్యులు, ప్రతాపురం భార్గవాచార్యులు, అమరవాది కృష్ణమాచార్యులు, టీజీవీ  సీతారామాను జాచార్యులు ఉన్నారు. వీరితో పాటు ఆరుగురు పరిచారకులు తరలివెళ్లనున్నారు. రామాలయంలో జరిగే కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.

 

Updated Date - 2022-01-22T04:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising