ఒకే ఈతలో పది పిల్లలకు జన్మనిచ్చిన శునకం
ABN, First Publish Date - 2022-12-25T22:52:30+05:30
ఒకే ఈతలో జర్మన్ షపర్డ్ బ్రీడ్‌కు చెందిన శునకం ఆదివారం పది పిల్లలకు జన్ననిచ్చింది.
పది పిల్లలతో శునకం
చింతకాని డిసెంబరు 25: ఒకే ఈతలో జర్మన్ షపర్డ్ బ్రీడ్‌కు చెందిన శునకం ఆదివారం పది పిల్లలకు జన్ననిచ్చింది. మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన పిట్టల కృష్ణకు చెందిన పెంపుడు శునకం తొలి ఈతలోనే పది పిల్లలకు జన్మనిచ్చింది. అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఒకే ఈతలో పది పిల్లలు పుట్టడం చాలా అరుదని, ఒకే సారి అధిక అండాలు విడుదలై ఫలదీకరణం చెందడం ద్వారా ఇలా జరుగుతుందని పశువైద్యాధికారి డా రాంజీ తెలిపారు.
Updated Date - 2022-12-25T22:52:31+05:30 IST