ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీలో మా సమస్యలు ప్రస్తావించరూ

ABN, First Publish Date - 2022-08-10T05:17:21+05:30

తమ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం అయ్యేలా చూడాలని వీఆర్‌ఏలు సీయల్‌పీ నేత భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. ఆజాదీ గౌరవ్‌యాత్రలో భాగంగా కూసుమంచి వచ్చిన భట్టిని కలిసి వినతిపత్రం అందించారు.

భట్టికి వినతిపత్రం అందిస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించిన బీఆర్‌ఏలు

కూసుమంచి, ఆగస్టు 9: తమ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం అయ్యేలా చూడాలని వీఆర్‌ఏలు సీయల్‌పీ నేత భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.  ఆజాదీ గౌరవ్‌యాత్రలో భాగంగా కూసుమంచి వచ్చిన భట్టిని కలిసి వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీలు నెరవేర్చడం లేదని తెలిపారు. వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఇవ్వాలని, పదోన్నతులు కల్పించాలని, 55సంవత్సరాలు దాటిన వీఆర్‌ ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు దారశ్రీను, అన్వర్‌, రవికుమార్‌, రమేష్‌, అనీల్‌, రంగమ్మ, నాగమణి పాల్గొన్నారు.

రూరల్‌ మండలానికి చేరుకున్న పాదయాత్ర

ఖమ్మంరూరల్‌:పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో మంగళవారం ప్రారంభమైన పాదయాత్ర మంగళవారంరాత్రి ఖమ్మంరూరల్‌ మండలం, మద్దులపల్లికి చేరుకుంది. మద్దులపల్లిలో నాయకులు రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు తిరిగి   ప్రారంభం కానుంది. మద్దులపల్లి నుంచి వరంగల్‌క్రాస్‌ రోడ్డు, పెద్దతండా, నాయుడుపేట మీదుగా ఖమ్మంలోకి వెలుతుంది. ఈపాదయాత్రలో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ముక్కా శేఖర్‌ గౌడ్‌, మండల నాయకులు మద్ది వీరారెడ్డి, కేతినేని వేణు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising