ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి ఈవో మార్పుపై చర్చ

ABN, First Publish Date - 2022-01-18T05:47:05+05:30

భద్రాద్రి ఈవో మార్పుపై చర్చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త ఈవోగా ప్రచారంలో నాగర్‌కర్నూల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ పేరు

భద్రాచలం, జనవరి 17: భద్రా చలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధి కారి మారే అవకాశాలు ఉన్నట్లు దేవ స్థానం ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగర్‌ కర్నూలు రెవె న్యూ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి భద్రాద్రి దేవస్థానం ఈవో పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇందుకు సంబందించిన కసరత్తు చివరి దశకు చేరుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. గతంలో హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాల యంలో భూముల విభాగంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు. కాగా ప్రస్తుతం నాగర్‌కర్నూలు అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపఽథ్యం లో ఆయన బదిలీపై భద్రాద్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సంవత్సర కాలంగా భద్రాద్రి దేవస్థానం ఈవోగా స్పెషల్‌గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్‌ బి.శివాజీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, సంక్రాంతి పండుగ ముగిసిన అనంతరం నూతన ఈవోను నియమించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరిగింది. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2022-01-18T05:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising