ధరణి పోర్టల్‌తో రైతులకు మేలు
ABN, First Publish Date - 2022-12-16T23:32:15+05:30
ధరణి పోర్టల్ వచ్చాక రైతులకు ఎక్కువగా మేలు జరిగిందని కలెక్టర్ వీపీ.గౌతమ్ అన్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమైన రైతులకు శుక్రవారం మండలంలోని గంగారం రైతువేదికలో రైతులకు పట్టా పాస్‌బుక్‌లను ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి పంపిణీ చేశారు.
సత్తుపల్లి/ పెనుబల్లి, డిసెంబరు 16: ధరణి పోర్టల్ వచ్చాక రైతులకు ఎక్కువగా మేలు జరిగిందని కలెక్టర్ వీపీ.గౌతమ్ అన్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమైన రైతులకు శుక్రవారం మండలంలోని గంగారం రైతువేదికలో రైతులకు పట్టా పాస్‌బుక్‌లను ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి పంపిణీ చేశారు. అంతకముందు ఆయన మాట్లాడుతూ జిల్లాలో 80శాతం మేర భూ సమస్యలు పరిష్కరించబడ్డాయని, ముఖ్యంగా సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో వేల ఎకరాల్లో భూముల విషయంలో రైతులకు ఉపశమనం లభించిందని, ఇందుకు ధరణి పోర్టల్ కారణమేనన్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 133సర్వే నెంబర్లో 1200మంది ఎన్వోసీ ఇచ్చామని, ఇందులో ధరఖాస్తు చేసుకుంది సుమారు 200మాత్రమేనని గుర్తుచేశారు. ఒక సంవత్సరంలో 17ఎన్వోసీలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి సీఎం విజన్‌తో వచ్చిన ధరణి పోర్టల్‌లో ఇప్పుడు వేల సంఖ్యలో ఇస్తున్నట్లు చెప్పారు.
రైతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్
రైతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం కేసీఆర్ గ్రామాలలో రైతువేదికలు నిర్మించి క్లస్టర్లలో ఏఈవోలను నియమించారని ఎమ్మెల్యే వెంకట వీరయ్య అన్నారు. భూ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టడంతో బేతుపల్లిలో ఏడు గ్రామాల్లోని రైతు లంతా ఇకనుంచి రైతుబంధు పొందవచ్చునన్నారు. అనంతరం సండ్ర, కలెక్టర్ గంగారంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల, డబుల్ ఇళ్లు, నిర్మాణంలోని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించారు. ముందుగా ఎస్బీఎస్ జూనియర్ కళాశాల, వీఆర్వోల గెస్ట్‌హౌస్‌లను చేరుకున్న ఆయన భవనాల నిర్మాణంపై పలు సూచనలు చేశారు. నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారఽథిరెడ్డి ఆర్థిక సహాయం అందిస్తుండగా అందుకు నివేదికలను రూపొందించాలని అధికారులను ఆయన సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో సూర్యనా రాయణ, తహసీల్దార్ టీ.నరసింహారావు, ఎంపీడీవో చిట్యాల సుభాషిణీ, మునిసిపల్ కమిషనర్ కే.సుజాలతో సమీక్ష నిర్వహించారు. పాతసెంటర్లోని మన ఊరు మన బడిలో భాగంగా హైస్కూల్‌ను అన్ని సౌకర్యాలతో త్వరగా పూర్తి చేయాలని ఎంఈవో, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణంలో ఉన్న 100పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వచ్చే వేసవి కల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా సర్వేయర్ బీ.శ్రీని వాసులు, వ్యవసాయశాఖ జిల్లా అధికారిణి విజయనిర్మల, ఏడీఏలు సరిత, నరసింహారావు, ఏవో వై.శ్రీనివాసరావు, గ్రంఽథా లయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆర్అండ్బి ఈఈ హేమలత, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, ఎంఈవో బీ.రాములు, సర్పంచ్‌లు మందపాటి శ్రీనివాసరెడ్డి, పాకలపాటి శ్రీనివాసరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
మండాలపాడులో..
మండాలపాడులో 47మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటవీరయ్య తన నియోజకవర్గ పరిధిలో నిబద్దత గల సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. తాళ్లపెంటలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించామని, మండాలపాడు గ్రామంలో 87మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వారిలో 47మందికి ఇప్పుడు పాస్‌పుస్తకాలు ఇచ్చామ న్నారు. మిగిలిన వారికి రెండురోజుల్లో ఇస్తామన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మండాలపాడులో 301 సర్వేనెంబర్లో 668ఎకరాల్లో అటవీశాఖ, రైతులకు మధ్య సమస్యలు ఉండేవని, కలెక్టర్ బృందంతో సహకారంతో దీనిని పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ అలేఖ్య, జడ్పీటీసీ మోహన్‌రావు, సర్పంచ్ తడికమళ్ల మంగమ్మ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో మహాలక్ష్మీ పాల్గొన్నారు.
పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మండాలపాడులో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ గౌతమ్ సందర్శించి పరిశీలిం చారు. ఈ సందర్భంగా తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రమాణాలకనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.15.90లక్షలతో చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మీ, ఎస్ఎంసీ చైర్మన్ నాగేశ్వర రావు, పీఆర్ ఈఈ చంద్రమౌళి, సర్పంచ్ తడికమళ్ల మంగమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:32:17+05:30 IST