ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీల హక్కులను హరిస్తే సహించేది లేదు

ABN, First Publish Date - 2022-08-10T05:36:55+05:30

ఆదివాసీ హక్కులు, సంస్కృతికి విఘాతం కలిగితే ఊరుకునేది లేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంగళవారం భద్రాచలంలో ఘ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మళ్లీ పుడితే ఆదివాసీగానే పుడతా

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

భద్రాచలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

భద్రాచలం, ఆగస్టు 9: ఆదివాసీ హక్కులు, సంస్కృతికి విఘాతం కలిగితే ఊరుకునేది లేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంగళవారం భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఉన్న ఆదివాసీ అమరవీరుల విగ్రహాలకు ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత జెండా ఊపి భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీలకు అనేక పోరాటాల చరిత్ర ఉందని, పోరాటాల ద్వారానే తమ హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆదివాసీపై ఉందన్నారు. ఒక ఆదివాసీగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మళ్లీ పుడితే ఆదివాసీగానే పుడతానని పొదెం వీరయ్య పేర్కొన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఐటీడీఏ అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ రమాదేవి, జీసీసీ జీఎం కుంజావాణి, జిల్లా  వ్యవసాయ అధికారి కొర్స అభిమన్యుడు, ఏపీఎంవో తెల్లం రమణయ్య, ఏటీడబ్ల్యువో పూనెం నర్సింహారావు, ప్రముఖ వైద్యులు డా. తెల్లం వెంకట్రావు, ఆదివాసీ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పూనెం కృష్ణదొర, పాయం రవివర్మ, ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముర్ల రమేష్‌,, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సరియం కోటేశ్వరరరావు, కారం పుల్లయ్య, ఆదివాసీ సంఘాల నాయకులు సోయం జోగారావు, సున్నం గంగ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T05:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising