ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు కారణాలతో ముగ్గురు వివాహితల ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-03-06T04:35:17+05:30

వేర్వేరు కారణాలతో ఇరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో శనివారం ముగ్గురు వివాహితలు ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏన్కూరు, మార్చి 5: వేర్వేరు కారణాలతో ఇరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో శనివారం ముగ్గురు వివాహితలు ఆత్మహత్య చేసుకున్నారు. ఏన్కూరు మండలం భద్రుతండాకు చెందిన బోడ శిరీష (23) అత్తింటి వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 2016లో జూలురుపాడు మండలం బొజ్జాతండాకు చెందిన శిరీషతో ఏన్కూరు మండలం భద్రుతండాకు చెందిన సురే్‌షతో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త, అత్త, బావ, మరిది వేధిస్తుండటంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. వివాహితకు నాలుగేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమరుడు ఉన్నా రు. మృతురాలి తల్లి  శాంతి ఇచ్చిన ఫిర్యాదులో ఎస్‌ఐ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కె.లక్ష్మీపురంలో పురుగులమందు తాగి..

దుమ్ముగూడెం మార్చి 5: మండల పరిధిలోని కెలక్ష్మీ పురంలో బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్న ఊకే రాజ్య లక్ష్మి(28) శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాచలం మండలం మేడువాయికి చెందిన రాజ్యలక్ష్మికి బూర్గంపాడు మండలం బత్తుల నాగారానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబకలహాల నేప థ్యంలో భార్య, భర్తలు విడిగా జీవిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బంధువుల ఇంటికి వచ్చిన రాజ్యలక్ష్మి వ్యవసాయ ప నులు చేసుకుంటూ జీవిస్తోంది. శనివారం రాజ్యలక్ష్మి నోటి వెంట నురగలు రావడం బంధువులు గమనించారు. దు మ్ముగూడెం పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేశారు.

మతిస్థిమితం లేక..

గుండాల, మార్చి 5: మతిస్థిమితం సరిగాలేని మహిళ పురుగుల మందుతాగి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కోనవారిగూడేనికి చెందిన సనప కమల(45) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మతిస్థిమితం కూడా సరిగా లేదు. దీంతో ఇంట్లో వ్యవసాయ అవసరాలకు దాచిన పురుగుల మందును శుక్రవారం రాత్రి తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి గుండాల ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యంకోసం కొత్తగూడెం తరలించారు. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. గుండాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-03-06T04:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising