ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ చొరవతో దమ్మపేటలో కోర్టు

ABN, First Publish Date - 2022-11-29T23:17:05+05:30

సీఎం కేసీఆర్‌ సహకారంతో దమ్మపేటలో కోర్టు ఏర్పాటు చేయటానికి మార్గం సుగమమం అయిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెచ్చా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దమ్మపేట, నవంబరు 29: సీఎం కేసీఆర్‌ సహకారంతో దమ్మపేటలో కోర్టు ఏర్పాటు చేయటానికి మార్గం సుగమమం అయిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. కోర్టు ఏర్పాటు చేయటానికి మల్లారంలొని ఖాళీగా వున్న ఎస్సీ సంక్షేమ భవనాన్ని కొత్తగూడెం జిల్లా జడ్జి చంధ్రశేఖరప్రసాదుతో కలసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం మఽధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతు దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు అందాల్సిన న్యాయసేవలు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి తరలించటం తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యను సీఎ కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. స్పందించిన సీఎం కోర్టు ఏర్పాటుకు చొరవచూపటంతో దమ్మపేటలో కోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమం అయిందన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు అడ్మినిస్ర్టేటివ్‌ జడ్జి రాధారాణికి విన్నవించటంతో కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని అన్నారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాలలో ఎక్కువ కేసులు వున్నా దృష్ట్యా కోర్టు ఏర్పాటు చేసే విధంగా చూడాలని జిల్లా జడ్జిని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి చంద్రశేఖర ప్రసాదు మాట్లాడుతూ దమ్మపేటలో కోర్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎంతో కృషి చేసారని న్యాయ సేవలు పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరగుతుందన్నారు. అనంతరం జిల్లా జడ్జి చంద్రశేఖర ప్రసాద్‌ను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులతో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ వెంకటేశ్వరరావు, ఎంపీపీ ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ మల్లి కార్జునరావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజేశ్వరరావు, సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ దారా యుగంధర్‌, తహసీల్దార్‌ స్వామి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాధాకృష్ణ, సత్తుపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌, అడ్మిన్‌ ఆఫీసర్‌ అనిత, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T23:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising