ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నియంత్రణకు చర్యలు

ABN, First Publish Date - 2022-01-18T05:25:08+05:30

కరోనాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్‌ (పా) ఎన్‌. బలరాం తెలిపారు.

వైద్యులతో మాట్లాడుతున్న డైరెక్టర్‌ (పా) బలరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగరేణి డైరెక్టర్‌ (పా) బలరాం 

రుద్రంపూర్‌, (సింగరేణి), జనవరి 17: కరోనాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్‌ (పా) ఎన్‌. బలరాం తెలిపారు. సింగరేణీయులందరికి వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేసేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్‌ డిస్పెన్సరీ ఆ సుపత్రిని సందర్శించారు. కార్మిక ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిపై సంబంధిత అధికారులతో చర్చించారు.  కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐసోలేషన్‌ గదులను పెంచాలని కోరారు. సింగరేణి మైన్స్‌, డిపార్టుమెంట్ల వద్ద కరోనా నిబంధనలను పాటించి కార్మికులు విధులకు హజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.కరోనా టెస్టులను పెంచాలన్నారు. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రద్రంపూర్‌ డిస్పెన్సరీలో అవస రమైన సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డైరెక్టర్‌ (పా) వెంట కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ నర్సింహారావు, ఎస్‌వోటు జీఎం నారాయణరావు,  డీజీఎం పర్సనల్‌ సామ్యూల్‌ సుధాకర్‌, వైద్యులు నర్సింహరావు, జగదీష్‌, లావణ్య, సీనియర్‌ సెక్యూరిటి అధికారి రమణా రెడ్డి, పర్సనల్‌ మేనేజర్‌ కిరణ్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising