ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరా అభివృద్ధికి సహకరించండి

ABN, First Publish Date - 2022-01-22T04:25:38+05:30

అడ్డంకులు కల్పించకుండా వైరా అభివృద్ధికి సహకరిస్తే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి మీ వ్యాపారాలు, జీవనోపాధి కోసం అవకాశం కల్పించేందుకు తాను అన్ని రకాల చర్యలు తీసుకుంటానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ భరోసా ఇచ్చారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తాం  

 ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌

వైరా, జనవరి 21: అడ్డంకులు కల్పించకుండా వైరా అభివృద్ధికి సహకరిస్తే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి మీ వ్యాపారాలు, జీవనోపాధి కోసం అవకాశం కల్పించేందుకు తాను అన్ని రకాల చర్యలు తీసుకుంటానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ భరోసా ఇచ్చారు. వైరాలోని ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖ, ఇండోర్‌ స్టేడియానికి సంబంధించిన స్థలాల్లోని కొంత మంది ఆక్రమణదారులు హైకోర్టు నుంచి స్టే తీసుకోచ్చి దుకాణాలు తొలగించకుండా ఉన్న సమయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులు, చేతివృత్తిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. న్యాయ పరమైన అడ్డంకులు కల్పించకుండా అభివృద్ధికి సహకరించాలని సూచించారు. 90 శాతానికి పైగా అక్రమణలు తొలగించినప్పటికీ మిగిలిన 10 శాతం మంది వలన అభివృద్ధి విషయంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఆక్రమణదారులు కూడా తమ దుకాణాలు స్వచ్ఛందంగా తొలగించి సహకరిస్తే.. ఆ మూడు శాఖ సమన్వయంతో తాను కలెక్టర్‌తో మాట్లాడి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి వాటిలో వ్యాపారాలు చేసుకోని జీవనం సాగించే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, 12వ వార్డు కౌన్సిరల్‌ వనమా విశ్వేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు దార్నా రాజశేఖర్‌, మండల కమిటీ మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T04:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising