ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2022-01-18T05:42:10+05:30

తామరపురుగు, ఎర్రనల్లి వైర్‌సతో నష్టపోయిన మిర్చి రైతులందరికి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్‌, బొంతు రాంబాబు, జిల్లా రైతుకూలీల అధ్యక్ష, కార్యదర్శులు మరీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

చిన్నమునగాలలో మాట్లాడుతున్న రైతుసంఘం జిల్లా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 21న ఉద్యాన శాఖ కార్యాలయ ముట్టడి

 రైతుసంఘాల పిలుపు

కొణిజర్ల/బోనకల్‌ జనవరి 17: తామరపురుగు, ఎర్రనల్లి వైర్‌సతో నష్టపోయిన మిర్చి రైతులందరికి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్‌, బొంతు రాంబాబు, జిల్లా రైతుకూలీల అధ్యక్ష, కార్యదర్శులు మరీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. 21న ఖమ్మంఉద్యాన శాఖ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని  కోరుతూ చిన్నమునగాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘాల నాయకులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య వీరభద్రం, అర్జున్‌రావు, పాశం అప్పారావు, షేక్‌ ఖాసీం, సుదర్శన్‌, వీరయ్య, చెరుకుమల్లి కుటుంభరావు, తాళ్ళపల్లి కృష్ణ, భద్రయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 

బోనకల్‌: వైరస్‌ వలన నష్టపోయిన మిరప రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో సోమవారం రైతు సంఘాల నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న నిర్వహించనున్న జిల్లా ఉద్యానవనశాఖా కార్యాలయం ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. మిరప రైతుల కోసం ఐక్యంగా అందరూ ఉద్యమించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దొండపాటి రమేష్‌, జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరావు, ఆవుల వెంకటేశ్వరావు, వాసిరెడ్డి ప్రసాద్‌, కిలారు తిరపతయ్య, రామారావు, సర్పంచ్‌ నన్నక్‌ లక్ష్మీ, ఉప సర్పంచ్‌ గుడ్డూరి ఉమ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T05:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising