ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్లలో కలెక్టర్‌ పర్యటన

ABN, First Publish Date - 2022-12-15T23:15:17+05:30

కలెక్టర్‌ అనుదీప్‌ గురువారం చర్ల మండలంలో పర్యటించారు. ముందుగా చర్ల మండలం వచ్చిన ఆయన చర్ల సీహెచ్‌సీని తనిఖీ చేశారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్ల, డిసెంబరు 15: కలెక్టర్‌ అనుదీప్‌ గురువారం చర్ల మండలంలో పర్యటించారు. ముందుగా చర్ల మండలం వచ్చిన ఆయన చర్ల సీహెచ్‌సీని తనిఖీ చేశారు. వైద్యం అందుతున్న తీరుని రోగులను అడిగి తెల్సుకున్నారు. అనం తరం రికార్డులను పరిశీలించారు. వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వై ద్యం అందించాలని వైద్యుడు శ్రీధర్‌ని ఆదేశించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో ఉన్న నూతన సీహెచ్‌సీ భవనాన్ని పరిశీలించారు. వెంటనే పనులు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వైద్యశాల నిర్మాణం పూర్తయిన వెంటనే అత్యాధునాతన పరికరాలతో పాటు, వైద్యులు నియమిస్తామని కలెక్టర్‌ తెలిపారు. అలాగే వైద్యశాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలసి ఎంపీడీవో రామకృష్ణను ఆదేశించారు. అనంతరం కొయ్యూరు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. ఓపీ సేవల గురించి అడిగితెల్సుకున్నారు. అనంతరం బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందజేశారు. కలెక్టర్‌ వెంట డీఎంఅండ్‌హెచ్‌వో శిరీష, రాజ్‌ కుమార్‌, చర్ల తహసీల్థార్‌ భరణిబాబు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T23:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising