‘డబుల్’ నిర్మాణంలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
ABN, First Publish Date - 2022-04-20T05:25:50+05:30
కొత్తగూడెంలో డబల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల జాప్యంపై కలెక్టర్ అనుదీప్ మండిపడ్డారు. నాలుగేళ్లైనా నిర్మాణాల్లో జాప్యంపై కాంట్రా క్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని పీఆర్ ఈఈ సుధా కర్‌ను ఆదేశించారు.
కొత్తగూడెం కలెక్టరేట్, ఏప్రిల్ 19: కొత్తగూడెంలో డబల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల జాప్యంపై కలెక్టర్ అనుదీప్ మండిపడ్డారు. నాలుగేళ్లైనా నిర్మాణాల్లో జాప్యంపై కాంట్రా క్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని పీఆర్ ఈఈ సుధా కర్‌ను ఆదేశించారు. భవిషత్తులో ఎలాంటి పనులు చేయ కుండా బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. కొత్తగూడెంలో 39.38 ఎకరాల్లో 69బ్లాక్‌ల్లో చేపట్టిన 820 ఇళ్ల నిర్మాణాల పనులను మంగళవారం ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వాస్తవంగా ఇళ్ల నిర్మాణాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటి వరకూ 39 బ్లాకులకు శ్లాబు పూర్తి చేశారని, ఇంకా 30 బ్లాక్‌లకు ఎందుకు శ్లాబు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. జాప్యానికి కారణం వివరించాలన్నారు. ఏది ఏమైనా మే నెలాఖరులోగా అన్ని సౌకర్యాలతో 108 ఇళ్లు అప్పగించాలని కలెక్టర్ అధికా రులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో దారుణమైన ప్రగ తి ఉందని, చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో ఉన్నది మరొకట ని మండిపడ్డారు. ఫ్లైయాష్ ఇటుకల కొరత కారణంగా ని ర్మాణంలో జాప్యం జరుగుతుందని, స్వంతంగా తయారు చేయడానికి ఫ్లైయాష్ ఇప్పించాలని కాంట్రాక్టు కోరగా ఇం డెంట్ ఇవ్వండి ఆ ప్రకారం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకొంటామన్నారు. మెటీరియల్ సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. పనుల ప్రగతిపై ప్రతి రోజు తనకు నివేదిక ఇవ్వాలన్నారు. కూలీల సంఖ్యను పెం చాలని, బ్రిక్‌వర్క్ వేగవంతం చేయాలన్నారు.
త్వరితగతిన పూర్తి చేయండి..
పాల్వంచ రూరల్: పాల్వంచ నవభారత్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూ ర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ కాంట్రాక్టర్‌ను ఆదేశిం చారు. మంగళవారం అధికారులతో కలసి డబుల్‌బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు. 2019లో ప్రారం భమైన ఈ పనిని నేటికీ పూర్తి చేయక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. డిసెంబర్ వరకు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట పంచాయితీరాజ్ ఈఈ సుధాకర్, తహశీల్ధార్ స్వామి, మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ తదితరులున్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కొత్తగూడెం కలెక్టరేట్: కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను మంగళవారం రాజకీయ పార్టీల ప్ర తినిధుల సమక్షంలో కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలల కోసారి గోడౌన్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, త్వరలో రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామ న్నారు. తప్పకుండా హాజరు కావాలని వారిని కోరారు. రాజ కీయ పార్టీల ప్రతినిధుల సమంక్షలోనే తిరిగి గోదామును సీల్ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీడియో తీసి భద్రపరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి గన్యా, ఎన్నికల పర్యవేక్షకులు ఎంఏ రాజు, సిబ్బంది నవీన్, సీపీఐ నేత శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకుడు లక్ష్మన్ అగ్రవాల్, బీఎస్‌పీ నాయకుడు వీరునాయక్, టీడీపీ నేత మోనాచారి, టీఆర్‌ఎస్ నేత సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2022-04-20T05:25:50+05:30 IST