బాలల హక్కులు కాపాడే బాధ్యత అందరిది: కలెక్టర్
ABN, First Publish Date - 2022-01-05T04:28:11+05:30
బాలల హక్కులను కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు వహించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు.
కొత్తగూడెం కలెక్టరేట్, జనవరి 4: బాలల హక్కులను కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు వహించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో మ హిళా శిశు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీ స్ అంగన్‌వాడీ సిబ్బందికి బాలల హక్కల పరిరక్షణపై నిర్వహించిన ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆ యన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆ యన మాట్లాడుతూ బాలలు తెలుసుకోలేని వయస్సులో ఎన్నో వత్తిళ్లకు, నేరాలకు, అఘాయిత్యాలకు గురువుతున్నా యని, చెప్పకోలేక పసిమనుసులు అల్లాడుతున్నాయ న్నారు. సంఘటన జరిగిన తర్వాత చెప్పుకోలేని దయనీయ స్థితిలో ప్రవర్తనలో వచ్చిన తేడాలను గమనించి తల్లిదం డ్రులు పలుమార్లు అడిగితే తప్ప చెప్పుకోలేని దుస్థితి ఉందన్నారు. మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యతను మనమే తీసుకోవాలన్నారు. బాలలపై జరుగుతున్న నేరా లకు ఘోరాలపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే వారి హక్కులు తెలుసుకొని రక్షించబడతారన్నారు. క్షేత్ర స్థాయిలో నేరాలు అరికట్టడం, చట్టపరంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శిక్షలు సత్వరం అమలు చేసేందుకు అవ కాశం కలుగుతుందన్నారు. చిన్నారులపై జరుగుతున్న సం ఘటనలపై తక్షణ శిక్షలు అమలు చేసేందుకు మన జిల్లా లో ప్రత్యేకంగా ఫోక్సో కోర్టు ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. అంగన్‌వాడీ, పోలీస్ సిబ్బంది, బాలల హక్కుల పరిరక్షణ కమిటి సభ్యులు చేస్తున్న కృషి ఫలితంగా ఇటు వంటి కేసులను సత్వర న్యాయసేవలు అందుతున్నా యన్నారు. ఏదేని అఘాయిత్యం జరిగిన బాలల నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తారని, కుటుంబ సభ్యునిగా అండగా ఉండి శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఇటువంటి నేలాను ప్రత్యేక కేసులుగా పరిగణిం చాలని, వారికి వెన్నుదన్నుగా సపోర్టు ఇవ్వడం, ధైర్యం అందించడం చేయాలన్నారు. బాల్యవివాహాలు, బాలల విక్రయాల నిర్వాహాణపై అధికారుల అనుభవాలను పంచుకొని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. సమ న్వయంతోనే జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ జిల్లాగా, స్నేహపూరిత బాలల జిల్లాలగా తయారు చేయాలన్నారు. పోషణ లోపం లేని చిన్నారులుగా తీర్చిదిద్దాలన్నారు. బాలల సంరక్షణాలయాలపై నిరంతర పటిష్ట పర్యవేక్షణ చేయాలని అంగన్‌వాడీ, పోలీస్, బాలల హక్కుల పరిర క్షణ కమిటీ బాధ్యులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్య క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, డిసిపిఓ హరి కుమారి, యూనిసెఫ్ ప్రొగ్రాం రిసోర్స్ పర్సన్ డెవిడ్‌రాజ్, బాలల హక్కుల పరిరక్షణ కమిటి సభ్యులు సుమిత్రాదేవి, సాదిక్, అంబేద్కర్,చైల్డ్ లైన్ అధికారి రాజ్‌కుమార్, పోలీస్, అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-01-05T04:28:11+05:30 IST