ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మనఊరు-మనబడి’ పనులపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN, First Publish Date - 2022-12-15T00:23:41+05:30

ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు-మన బడి’ పనులకు బుధవారం కలెక్టర్‌ అనుదీప్‌ పరిశీలించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంజయ్‌నగర్‌ పాఠశాల తనిఖీ

ఇల్లెందురూరల్‌, డిసెంబరు 14: ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు-మన బడి’ పనులకు బుధవారం కలెక్టర్‌ అనుదీప్‌ పరిశీలించారు. పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ చేయలేదని, అక్కడక్కడ పాత వాటికే రంగులు వేశారని ఇలా చేస్తే ఎలా అంటూ అధికారులపై మండిపడ్డాడు. తక్షణమే పాఠశాలలో మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణవేణి, ఏంపీడీవో అప్పారావు, ఎంపీఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని

పకడ్బందీగా అమలు చేయాలి: జడ్పీ సీఈవో

చుంచుపల్లి: మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని మండలంలో పకడ్బందీగా అమలుచేయాలని చుంచుపల్లి మండల ప్రత్యేక అధికారిని, జడ్పీ సీఈవో మెరుగు విద్యాలత అన్నారు. బుధవారం మండలంలోని అంబేద్కర్‌నగర్‌కాలనీ, పెనగడప, బాబుక్యాంపు, విద్యానగర్‌కాలపీ పంచాయతీ, చుంచుపల్లి పాఠశాలలను తనిఖీ చేసి సూచనలు చేశారు. మన ఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మరమ్మతులు, అదనపు తరగతుల్లో విద్యుత్‌ లైట్లు, ఫ్యాన్లు, వైర్లు ఏర్పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని నాణ్యతతో కట్టడాలను నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీడీవో సకినాల రమేష్‌, ఎంపీవో గుంటి సత్యనారాయణ, ఈజీఎస్‌ ఈసీ నాగరాజు, టీఎ అస్మా, పంచాయతీ కార్యదర్శులు హనుమంతు, సీహెచ్‌. రఘు, వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు మాలోత్‌ కళావతి, బాబురావు, బానోత్‌ గోవిందు, బొంతు బాబురావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising