ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన ఊరు- మన బడి త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T22:40:24+05:30

మన ఊరు - మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ వి.పి గౌతమ్‌ అధికారులను సూచించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొణిజర్ల, డిసెంబరు 15: మన ఊరు - మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ వి.పి గౌతమ్‌ అధికారులను సూచించారు. మండల పర్యటనలో భాగంగా గురువారం పెద్దగోపతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు చైతన్య ట్రస్ట్‌ ద్వారా ఖమ్మం హార్వెస్ట్‌లో పదో తరగతి చదువుతున్న చిన్నారి వాసిరెడ్డి ఉనికి తాను పొదుపు చేసుకున్న డబ్బుతో కంప్యూటర్‌ను కొనుగోలు చేసి ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఆ ల్యా బ్‌ను కలెక్టర్‌ ఉనికితో కలిసి ప్రారంభించారు. ల్యాబ్‌కు ఒక టీచర్‌ను కూడ ఏర్పాటు చేసి వారికి ప్రతినెల ఇచ్చే వేతనాన్ని చైతన్య ట్రస్ట్‌ ద్వారా అందిస్తామని ఉనికి తల్లిదండ్రులు కలెక్టర్‌ ముందు తెలిపారు. చిన్నతనంలోనే ఉనికి కి ఉన్న ఆలోచనను కలెక్టర్‌ అభినందించారు. మన ఊరు మన బడి పనులు నిర్మాణంలో ఉండటంతో ఈ నెల చివరి వరకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలల సందర్శన

కలెక్టర్‌ పెద్దగోపతి, లల్లోరిగూడెం ప్రాథమిక పాఠశాల, తీగలబంజర పాఠశాలను తనిఖీ చేశారు. ప్రతి పాఠశాలలో గంటకు పైగా సమయం కేటాయించి విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని పరీక్షించారు. తీగలబంజరలో కొంతమంది పిల్లలు ఇంగ్లీషు, తెలుగును చూసి కూడా చదవలేకపోవడంతో ఇంకా విద్యార్థులను మెరుగు పరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పెద్దగోపతిలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. లల్లోరిగూడం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ విద్యార్ధులు తరగతి గదిలో కాకుండా వరండాలో కూర్చోని ఉండటంతో ఆరా తీశారు. గదిలో సిమెంట్‌ ఉండటంతో కూర్చోపెట్టామని ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సిమెంట్‌ బస్తాలను వేరే గదిలోకి మార్చాలని అధికారులను ఆదేశంచారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఇన్‌చార్జ్‌ అధికారి సత్యనారాయణ, నాగశేషు, డీఈ వైకుంఠాచారి, ఏఎంవో రవికుమార్‌, ఎస్‌వో రామకృష్ణ, మండల విద్యాశాఖాధికారి శ్యాంసన్‌, తహసీల్దార్‌ సైదులు, ఎంపీవో ప్రభాకర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు దానియేలు, రేషన్‌బేగ్‌, ఎంపీటీసీలు రమాదేవి, దొడ్డపిన్ని నాగమణి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising