సమస్యల సంత
ABN, First Publish Date - 2022-12-07T23:26:06+05:30
భద్రాచలం ఏజెన్సీలో అతిపెద్ద వారాంతపు సంత ఏదంటే చర్ల సంత అని చెప్పాలి.
చర్ల, డిసెంబరు 7: భద్రాచలం ఏజెన్సీలో అతిపెద్ద వారాంతపు సంత ఏదంటే చర్ల సంత అని చెప్పాలి. ఆది వారం జరిగే ఈ వారపు సంతకు చర్ల మండలంతో పాటు సరిహాద్దు చత్తీస్ ఘడ్, ఒరిస్సా నుంచి అనేక మంది గిరిజనులు హాజరవుతారు. ఈ సంతలో దొరకని వస్తువులు ఉంటవు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సంత నేడు సమస్యలతో సతమతమవుతోంది. స్థానిక సంత మార్కెట్ ఉన్న అది సరిపోవడం లేదు. దీంతో సంత వ్యాపారులు ప్రధాన రహదారి మీదనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడు తు న్నాయి. ఒక్కో సారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. స్థానికులు, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రహ దారిపై వాహనాలు వెళ్లేందుకు సైతం ఇబ్బందులు ఏర్పడు తున్నాయి. ఒక్కోసారి రోడ్డుపై నడిచేందుకు సైతం ఇబ్బం ది ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు సంత మార్కె ట్‌పై దృష్టి సారించి ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని పలువురు కోరుతున్నారు. చర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగే వారపు సం తనే అతిపెద్ద వారపు సంతగా వ్యాపారులు చెబుతుంటారు. ఈ సంతకు సరిహద్దున ఉన్న చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి బారీగా ఆదివాసీలు హాజరవుతుంటారు. ప్రతీ ఆదివారం సుమారు 20 వేల మంది వారికి కావాల్సిన వస్తువులను ఈ సంతలోనే కొనుగోలు చేస్తుంటారు. ఈ సంతలో దొరకని వస్తువు ఉండదని పలువురు చెబుతుంటారు. వారపు సంతకు బారీగా గిరిజనులు హాజరవుతుండంతో వ్యాపార సముదాయాలు కూడా అలానే వెలుస్తుంటాయి. ప్రతీ వారం సుమారు 150నుంచి 200 దుకాణాలు పెడుతుంటారు. దుకాణాలు అధికం అవ్వడంతో పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంత మార్కెట్ సరిపోవడం లేదు. దీంతో వ్యాపారస్తులు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక రహదారుల పైనే దుకాణాలు పెడుతున్నారు. ఇప్పటి కైనా సంత నిర్వహణ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని పలువురు కోరుతున్నారు.చర్లకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి అధికంగా ఆదివాసీలు వస్తారు. చర్లలో దొరికే గిన్నెలు, డబ్బాలు, దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు. అ లాగే అక్కడ నుంచి మేకలను, గొడ్లను పట్టుకుని వచ్చి చర్లలో అమ్మకాలు జరుపుతారు. అలాగే చర్లలో దొరికే ఇతర వస్తువులు కూడా తెచ్చి చర్లలో అమ్మకాలు జరుపుతారు. దీంతో ఇక్కడి సంతకు ప్రాధాన్యత ఏర్పడింది.
Updated Date - 2022-12-07T23:26:10+05:30 IST