ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్కడ బతకలేం

ABN, First Publish Date - 2022-07-29T04:56:53+05:30

‘ప్రతీ ఏడాది గోదావరి వరద వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు అన్ని గోదావరి వరదల పాలవుతున్నాయి. పంట పొలాలు మునిగిపొయి తీవ్ర నష్టాలకు గురవుతున్నాం. ఒక పక్క కిన్నెరసాని, మరో పక్క గోదావరి వరదల వల్ల సర్వ కోల్పోతున్నాం. మరో పక్క పోలవరం ప్రాజెక్టు మరింతగా బూర్గంపాడు గోదావరి వరద ముంపునకు గురవుతుంది. ప్రతి ఏడాది ఇలాగే భాదపడుతున్నాం..ఇక మేము ఇంకా వరద కష్టాలు పడలేమంటూ’ బూర్గంపాడకు చెందిన వరద బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

వరద ముంపులో బూర్గంపాడు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ వరద కష్టాలు ఇక పడలేం

సురక్షిత ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తే వెళ్లిపోతాం

ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలి

బూర్గంపాడు వరద బాధితుల ఆవేదన

బూర్గంపాడు, జూలై 28: ‘ప్రతీ ఏడాది గోదావరి వరద వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు అన్ని గోదావరి వరదల పాలవుతున్నాయి. పంట పొలాలు మునిగిపొయి తీవ్ర నష్టాలకు గురవుతున్నాం. ఒక పక్క కిన్నెరసాని, మరో పక్క గోదావరి వరదల వల్ల సర్వ కోల్పోతున్నాం. మరో పక్క పోలవరం ప్రాజెక్టు మరింతగా బూర్గంపాడు గోదావరి వరద ముంపునకు గురవుతుంది. ప్రతి ఏడాది ఇలాగే భాదపడుతున్నాం..ఇక మేము ఇంకా వరద కష్టాలు పడలేమంటూ’ బూర్గంపాడకు చెందిన వరద బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

వరద వల్ల దుఃఖమే మిగులుతోంది

గోదావరి వరదల వల్ల తమకు ప్రతీ ఏటా దుఃఖమే మిగులుతోందని బూర్గంపాడులోని ఎస్సీ కాలనీకి చెందిన వరద బాధితులు అంటున్నారు. బతికేందుకు వివిధ వృత్తులను చేసుకుంటూ ఉన్న కొద్ది పాటి భూముల్లో వ్యవసాయ పంటలు పండిచుకుంటున్నామని, గోదావరి వరదలతో అప్పుల ఊబిలో కురుకుపోయామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలు కట్టుబట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని, ఆస్తిపాస్తులను పొగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపంతో మండల ప్రజలు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకని పిల్లపాపలతో రాత్రికిరాత్రే పునారావాస కేంద్రాలకు తరలిపోయామని, సామాన్లన్నీ వరదలో కొట్టుకుపో యాయని చెబుతున్నారు.

ఇకనైనా పాలకులు పట్టించుకోరా?

బూర్గంపాడు ప్రతి ఏటా గోదావరి వరద ఉదృతితో నష్టపోతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. సురక్షిత ప్రాంతాలలో తమకు స్ధలాలు ఏర్పాటు చేస్తే తక్షణమే ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతామని చెబుతున్నారు. తమ తాతముత్తాతలు తల్లిదండ్రులు గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయారని, ఈ బాధలు మేము పడలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని సురక్షిత ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములలో తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

పోలవరంతో ముంపు ముప్పు

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బూర్గంపాడులోని ఎస్సీ కాలనీతో పాటు పలు కాలనీలు గోదావరి ముంపునకు గురవుతాయని స్ధానికులు అంటున్నారు. ప్రతి ఏటా గోదావరి వరద 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక దాటగానే తమ కాలనీలోని ఇళ్లు చుట్టూ గోదావరి వరద చేరుతుందని వారు పేర్కొంటున్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌తో బూర్గంపాడు ముంపు ముప్ప తప్పదని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత ప్రమా దం ఉన్నా ప్రజాప్రతినిధులు బూర్గంపాడు గురించి నోరు మెదపకపోవడం శోచనీయమని గ్రామస్ధులు అంటున్నారు.

Updated Date - 2022-07-29T04:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising