ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీ రోడ్డుకు బుంగ.. పొంచిఉన్న ప్రమాదం

ABN, First Publish Date - 2022-05-15T06:03:23+05:30

పట్టణంలోని ఓచోట తాగునీటి పైప్‌లైన్‌ లీకవ్వడంతో బీటీ రోడ్డుకు పెద్ద రంధ్రం ఏర్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

సిద్దారం రోడ్‌లో బీటీకి రోడ్డుకు ఏర్పడిన బుంగ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లి, మే 14: పట్టణంలోని ఓచోట తాగునీటి పైప్‌లైన్‌ లీకవ్వడంతో బీటీ రోడ్డుకు పెద్ద రంధ్రం ఏర్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిద్దారం రోడ్‌ నుంచి కృషి బైపాస్‌ రోడ్‌కు వెళ్లేదారి కార్నర్‌లో బీటీ రోడ్డు పరిస్థితి ఇది. ఇక్కడ నిత్యం తాగునీరు పైప్‌లైన్‌ లీకవ్వడంతో వరద ఏర్పడుతుంది. దాంతో నీటికి బీటీ రోడ్డు నానడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది. వాహనాలు వేలాదిగా రాకపోకలు సాగించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో వాహనదారులు భయాందోళనలో పడ్డారు.

పెట్రోల్‌ బంక్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్స్‌

పట్టణంలోని హనుమాన్‌నగర్‌ వద్ద జాతీయ రహదారిపై పోలీసు అధికారులు నియంత్రికలు ఏర్పాటుచేశారు. దీంతో సమీపంలోని వాహనదారులు మాధురీ ఫంక్షన్‌హాల్‌ వద్ద నుంచి యూటర్న్‌ తీసుకోవాల్సి వస్తుంది. అటుగా వేగంగా వచ్చే వాహనాలతోనూ ప్రమాదం పొంచివుంది. ఇక్కడ కూడా అధికారులు అధికారికంగా యూటర్న్‌ స్పేస్‌ ఇవ్వలేదు. ఇదే విషయమై సత్తుపల్లి సీఐను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్‌ కలవలేదు. ఎస్‌ఐ షాకీర్‌ను వివరణ కోరగా పరిశీలిస్తానని తెలిపారు.


Updated Date - 2022-05-15T06:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising