ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీపీఎస్‌ రైల్వేట్రాక్‌ పనుల అడ్డగింత

ABN, First Publish Date - 2022-03-06T04:34:13+05:30

మణుగూరు బీటీపీఎస్‌కు చేపట్టిన రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులను మండలంలోని రామానుజవరం వద్ద నిర్వాసిత రైతులు శనివారం అడ్డుకున్నారు.

నిర్వాసితులను చెదరగొడుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరైన పరిహారానికి నిర్వాసిత రైతుల ఆందోళన 

తీవ్రంగా ప్రతిఘటించిన పోలీసులు 

వాగ్వాదం, తోపులాటతో రణరంగంగా రామానుజవరం

పలువురికి గాయాలు

మహిళకు అస్వస్థత 

మణుగూరు, మార్చి 5 : మణుగూరు బీటీపీఎస్‌కు చేపట్టిన రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులను మండలంలోని రామానుజవరం వద్ద నిర్వాసిత రైతులు శనివారం అడ్డుకున్నారు. ట్రాక్‌ పనులను చేపడుతున్న ప్రోక్లైయినర్‌లను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. ఎంతకీ ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో నిర్వాసిత రైతును చెదరగొట్టేందుకు బలప్రయోగం చేశారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. క్షతగాతులను స్థానికులు రోడ్డుకు తరలించారు. పోలీసులు దొరికిన వారిని దొరికనట్లు ఆటోలో ఎక్కించి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర పెనుగులాట జరిగింది, నిర్వాసిత రైతులు కన్నీరు మున్నీరయ్యారు. పలువురు మహిళలు మహిళా కానిస్టేబుళ్లతో వాదనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరితే మహిళలనికూడా చూడకుండా తమను ఈడ్చిపడేశారని పలువురు మహిళలు ఆరోపించారు. తోపులాటలో సొమ్మసిల్లిపడి పోయిన బొగ్గుల బేబి అనే మహిళతో పాటు గాయపడ్డవారిని  స్థానికులు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇదిలా ఉండగా నిర్వాసితులకు అండగా నిలిచేందుకు కరకగూడెం కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఇక్బాల్‌ హుస్సేన్‌ తదితరులు ఘటనా స్థలానికి వచ్చారు. కాగా ఈఘటనలో 20 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2022-03-06T04:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising