ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వైరాలో మెగా రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2022-08-17T04:36:14+05:30

ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాములునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, ఆగస్టు 16: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పిలుపునిచ్చారు. వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం వైరాలోని తమ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో రక్తదాన శిబిరం నిర్వహణపై డాక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్స వాలను పురస్కరించుకొని నియోజకవర్గస్థాయిలో మెగా రక్తదాన శిబిరాన్ని వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కనీసం 250మందికిపైగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్‌ కోటిరత్నం, వైరా డాక్టర్‌ నాగరాజు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఏఎంసీ చైర్మన్‌ బీడీకే.రత్నం, కౌన్సిలర్‌ వనమా విశ్వేశ్వరరావు, లయన్స్‌క్లబ్‌ నిర్వాహాకుడు డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, నాయకులు మచ్చా బుజ్జి, కట్టా కృష్ణార్జున్‌రావు, బాణాల వెంకటేశ్వరరావు, పసుపులేటి మోహన్‌రావు, ధార్న రాజశేఖర్‌, షేక్‌.రహీం, పోలా శ్రీను, మద్దెల రవి, ఆరోగ్యశాఖ సిబ్బంది ధనలక్ష్మీ, అనంతరాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T04:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising