ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ బిల్లులకే దిక్కు లేదు

ABN, First Publish Date - 2022-12-15T22:45:12+05:30

గ్రామపంచాయతీల్లో అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటివరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించలేదు.

పెండింగ్‌ బిల్లులపై సమావేశంలో అధికారులను ప్రశ్నిస్తున్న అమ్మపాలెం సర్పంచ్‌ రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంసూరు, డిసెంబరు 15: ‘గ్రామపంచాయతీల్లో అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటివరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించలేదు. మళ్ళీ పనులు చేయమంటే ఎలా అని’ పలువురు సర్పంచ్‌లు ప్రశ్నించారు. గురువారం మండలపరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమ్మపాలెం సర్పంచ్‌ మేడా రమేష్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తయ్యాయని, వాటికి ఇంతవరకు బిల్లులు రాకపోతే పంచాయతీలను ఎలా అభివృద్ధి చేసుకోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని సర్పంచ్‌లంతా అడగడంతో అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వేంసూరు సర్పంచ్‌ గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డు నిర్మాణానికి అసైన్‌మెంట్‌ భూముల్లో నుంచి మట్టిని అనుమతి లేకుండా తరలిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన తహసీల్దార్‌ ముజాహిద్‌ మాట్లాడుతూ మట్టి తరలింపుపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మర్లపాడు ఎంపీటీసీ రాఘవరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి 24గంటల కరెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎంపీడీవో వీరేశం, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising