ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ దహనం కేసులో ఎనిమిదిమంది అరెస్టు

ABN, First Publish Date - 2022-12-09T23:29:29+05:30

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ద్విచక్రవాహనం దహనం చేసిన కేసులో ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్‌ సీఐ హనుక్‌ తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ హనుక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుబల్లి, డిసెంబరు 9: ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ద్విచక్రవాహనం దహనం చేసిన కేసులో ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్‌ సీఐ హనుక్‌ తెలిపారు. శుక్రవారం వీఎంబంజర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం సీఐ హనుక్‌ మాట్లాడుతూ వన్యప్రాణుల వేట కోసం అమర్చిన కరెంట్‌ తీగెలను ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటారనే అధికారుల దృష్టిని మరల్చటానికే ద్విచక్రవాహనం తగులబెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. ఫారెస్ట్‌ అధికారి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టిన ఎనిమిదిమంది నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అడవిలో కరెంట్‌వైర్లు పెట్టి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ సూరజ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising