ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగదు కోసం రైతుల అరిగోస

ABN, First Publish Date - 2022-01-21T05:53:08+05:30

నగదు కోసం రైతుల అరిగోస

లారీలకు ఎగుమతి చేస్తున్న ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాన్యం సొమ్ము కోసం నెలరోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ

ఖమ్మం జిల్లాలో రూ.250కోట్ల మేర బకాయిలు

వైరా, జనవరి 20 : ఆరుగాలం పండించిన పంటను విక్రయించడం ఒక ఎత్తయితే.. అమ్ముకున్న ధాన్యానికి వచ్చే సొమ్మును దక్కించుకోవడం మరో ఎత్తయ్యింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్ముకుని నెలరోజులైనా నేటికీ వారికి పంట సొమ్ము అందకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఖమ్మంజిల్లాలో దాదాపు 20వేలమంది రైతులు ధాన్యం నగదు కోసం నెలరోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. జిల్లాలో రూ.250కోట్ల వరకు ప్రభుత్వం ధాన్యం రైతులకు నగదు బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మంజిల్లాలో ఈ వానాకాలం వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కోసం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో 5, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 29, ఐకేపీ ఆధ్వర్యంలో 50, సొసైటీల ఆధ్వర్యంలో 172 మొత్తం 256కొనుగోలు కేంద్రాలకు కలెక్టర్‌ అనుమతిచ్చారు. అయితే ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 152తో పాటు ఏజెన్సీలతో కలుపుకొని మొత్తం 236కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గ్రేడ్‌ఏ, కామన్‌ గ్రేడ్‌ ధాన్యాన్ని ఇప్పటివరకు 2,62,431.200మెట్రిక్‌ టన్నులను 36,185మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే ఇప్పటివరకు 31,865మంది రైతుల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌ చేశారు. ఇంకా 4,320మంది రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లోని ట్యాలీలో ఎంట్రీ చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో చేసిన రైతుల్లో 20,829మంది రైతులకు రూ.310.54కోట్లు నగదు చెల్లించారు. ఆన్‌లైన్‌ అయిన రైతుల్లో 15,356మంది రైతులకు రూ.201.46కోట్ల నగదు చెల్లించాల్సి ఉంది. ఇంకా కొనుగోలు కేంద్రాల్లోని ట్యాబ్‌ల్లో వివరాలు నమోదు కాని రైతులు 4.320మందికి రూ.48.70కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే 1,788కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. కొనుగోలు మొదట్లో నగదు చెల్లింపులు వేగంగా జరిగాయి. అయితే నెలరోజులుగా ఆయా ఏజన్సీల నుంచి కొనుగోలు చేసిన రైతుల ధాన్యానికి నగదు చెల్లింపుల కోసం ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధాన్యం విక్రయించిన రైతులు ప్రతిరోజూ బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాల్లో నగదు జమ అయిందోలేదోనని ఆరా తీస్తున్నారు. తమకు వెంటనే నగదు చెల్లించాలని ధాన్యం రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-01-21T05:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising