ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో అల్లు శిరీష్‌ సందడి

ABN, First Publish Date - 2022-11-02T00:04:11+05:30

ఊర్వశివో రాక్షసివో హీరో అల్లు శిరీష్‌ మంగళవారం నగరంలోని బొమ్మ ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడి చేశారు.

అభిమానులకు అభివాదం చేస్తున్న సినీహీరో అల్లు శిరీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంఖానాపురంహవేలి, నవంబరు1: ఊర్వశివో రాక్షసివో హీరో అల్లు శిరీష్‌ మంగళవారం నగరంలోని బొమ్మ ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడి చేశారు. 4వతేదీన విడుదల కాబోతున్న ఈసినిమా ప్రమోషన్‌లో భాగంగా శిరీష్‌ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అల్లు శిరీష్‌ రాకతో కళాశాలలో విద్యార్థులు, అభిమానులతో సందడి నెలకొంది. అనంతరం అల్లు శిరీష్‌ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విశేషాలను విద్యార్ధులకు వివరించారు. సినిమాలోని పాటలకు శిరీష్‌ డ్యాన్స్‌ చేసి అలరించారు. డైలాగులతో ఉర్రూతలూగించారు. కామెడితో పాటు మంచి కథతో కూడుకున్న సినిమా అని, ఇది అభిమానులను, ప్రేక్షకులందరిని అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. సినిమా ఆడియో రిలీజ్‌ కార్యక్రమానికి హీరో నందమూరి బాలకృష్ణ హాజరుకావడం ఆనందంగా ఉందని, సినిమా రిలీజ్‌ అనంతరం సక్సెస్‌ మీట్‌ను కూడా ఖమ్మంలో నిర్వహిస్తామన్నారు. అనంతరం అభిమానులతో, విద్యార్థులతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కార్యక్రమంలో బొమ్మ విద్యాసంస్థల చైర్మన్‌ బొమ్మ రాజేశ్వరరావు, వైస్‌చైర్మన్‌ బొమ్మ సత్యప్రసాద్‌, లక్ష్మిరాజ్యం, అనూష, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకుల పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T00:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising