నాలుగేళ్ల తర్వాత..
ABN, First Publish Date - 2022-10-07T06:28:01+05:30
నాలుగేళ్ల తర్వాత..
పీఎం 15 సూత్రాల పథకంపై నేడు భద్రాద్రి కలెక్టరేట్‌లో సమీక్ష
హాజరుకానున్న జాతీయ మైనార్టీ కమిషన సభ్యురాలు
అభివృద్ధి, సంక్షేమంపై చర్చించనున్న షహజాదీ బేగం
కొత్తగూడెం కలెక్టరేట్, అక్టోబరు 6: మైనారిటీల స్థితిగతుల మెరుగుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం భధ్రాద్రి జిల్లాలో ఆచరణకు నోచుకోలేదు.ఈ పథకం ఒకటి ఉందనే విషయాన్ని జిల్లా అధికారు లు మరిచారు. ఈ క్రమంలో శుక్రవారం జాతీయ మైనారిటీ కమిషన సభ్యురాలు సయ్యద్ షహజాదీ బేగం జిల్లా కలెక్టరేట్‌లో15 సూత్రా ల పథకంపై సమీక్షించనున్నారు.దీంతో జిల్లా అధికారుల్లో హడావుడి మొదలైంది మరిఈ సమీ క్ష సమావేశం తర్వాతనైనా మార్పువస్తుందో లేదో వేచిచూడాలి.
మైనారిటీ పేదల అభ్యున్నతే పథకం లక్ష్యం
మైనారిటీ పేదల అభివృద్ధి, సంక్షేమానికి 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలులోకి తెచ్చింది. పథకం అమలు కు రాషా్ట్రల్లో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశారు. 2016లో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోప్రకారం జిల్లాలో కమిటీలను 2018 ఫిబ్రవరిలో ప్రత్యేక కమిటీలుగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మనగా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు సభ్యులుగా, అప్పటి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ఎస్సీ, డీఆర్‌డీవో, ఇతర జిల్లాస్థాయి అధికారులు, ముగ్గురు ఎనజీవోలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతీ మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి మినిట్స్‌ను, వివరాలను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న పార్లమెంట్‌లో సమర్పించాలి. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడు పదవీకాలం పూర్తి అయ్యింది. జిల్లాలో ముస్లింలు 63,439 మంది, క్రిస్టియన్లు 12,276, సిక్కులు 276, బౌద్ధులు 94, జైన్లు 125, పార్శీలు 38మంది ఉన్నారు. కనీసం జాతీయ కమిషన సభ్యురాలి రాకతోనైనా మైనార్టీల అశలు చిగురిస్తాయో వేచి చూడాలి.
Updated Date - 2022-10-07T06:28:01+05:30 IST