ఓటు నమోదులో భాగస్వాములు కావాలి
ABN, First Publish Date - 2022-12-07T23:21:59+05:30
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటు హక్కును అందరూ పొందేలా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు కోరారు.
అశ్వారావుపేట రూరల్, డిసెంబరు 7: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటు హక్కును అందరూ పొందేలా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం సాయంత్రం రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్‌వోలు, రెవిన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. యువత ఓటు హక్కును పొందేలా చూడాలని తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు పొందేలా చూ డాలన్నారు. ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. వచ్చే నెలలో సిద్దం అయ్యే ఓటరు జాబితాలో చేర్పులు మార్పులు ఉంటే దరఖాస్తులు చేసుకునేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలని తెలిపారు.
Updated Date - 2022-12-07T23:22:03+05:30 IST