ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు

ABN, First Publish Date - 2022-10-14T04:21:34+05:30

విద్యార్థులో పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వివిధ గ్రామాల్లో గల గ్రంఽథాలయాలను అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 13: విద్యార్థులో పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వివిధ గ్రామాల్లో గల గ్రంఽథాలయాలను అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. గురువారం తొలిమెట్టు (మౌలిక భాషా, గణిత సామర్థ్యాల సాదన) కార్యక్రమం అమలు తీరుపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ తొలిమెట్టు అమలుపై ఈనెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమాలపై షెడ్యూల్‌ను తయారు చేసి అమలు పరచాలని డీఈవో సోమశేఖర్‌శర్మను ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పనులు మొదలు పెట్టని పాఠశాలల్లో వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత ఈఈలను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ సోమశేఖర్‌శర్మ, ఇరిగేషన్‌, పీఆర్‌, ఆర్‌ అండ్‌ భీ, ఇంజనీరింగ్‌ ఈఈలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-14T04:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising