ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిన్నంటిన ఆర్తనాదాలు

ABN, First Publish Date - 2022-01-29T05:56:16+05:30

చండ్రుగొండ మండలం తిప్పన పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహిళ లలంతా బంధువులే. దీంతో వారి స్వగ్రామం సుజాతానగర్‌ మండలం అంబేద్కర్‌నగర్‌లో విశాదఛాయలు నెలకొన్నా యి. నిత్యం కూలి పనులకు వెళ్లూ కుటంబాలను పోషించు కునే మహిళలు అర్ధాంతంరంగా అసువులుబాయడం దిగ్ర్భాంతిని కలిగిస్తోంది.

సంఘటనా స్థలంలో మృతదేహాలతో ఆందోళన చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిప్పనపల్లి ఘటనలో మృతులంతా బంధువులే

చండ్రుగొండ/సుజాతనగర్‌/ కొత్తగూడెం కలెక్టరేట్‌/ చుంచుపల్లి,  జనవరి28: చండ్రుగొండ మండలం తిప్పన పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహిళ లలంతా బంధువులే. దీంతో వారి స్వగ్రామం సుజాతానగర్‌ మండలం అంబేద్కర్‌నగర్‌లో విశాదఛాయలు నెలకొన్నా యి. నిత్యం కూలి పనులకు వెళ్లూ కుటంబాలను పోషించు కునే మహిళలు అర్ధాంతంరంగా అసువులుబాయడం దిగ్ర్భాంతిని కలిగిస్తోంది.

పిన్న వయసులోనే అనంతలోకాలకు.. 

దళితవాడకు చెందిన స్వాతి(27) పిన్న వయసులోనే అనంతలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం కన్నీరుము న్నీరుగా విలపిస్తోంది. ఆమె భర్త నర్సింహారావు కూడా కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. వారికి ఇద్దరు కుమారులు ఆరేళ్ల సంజయ్‌, ఏడేళ్ల వరుణ్‌ ఉన్నారు. కూలీపనులకు వెళ్లిన తమ తల్లి తిరిగివస్తుందని ఎదురుచూస్తున్న ఆ అభంశుభం తెలియని చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. తమ తల్లి చనిపోయిందని వారికి ఎలా చెప్పాలో, వారిని ఎలా ఓదార్చాలో తెలియక తండ్రి నరకయాతన పడిన తీరు కలిచివేసింది.  

జయలక్ష్మికి దిక్కెవరు?

అదే గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మిదేవి(50) కూలీ పనులకు వెళ్తూ జీవితం వెళ్లదీస్తోంది. ఆమెకు ఒక కూతురు, ఇద్దరు కుమారులుండగా.. భర్త కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తన పెద్ద కుమారుడు నర్సింహారావు కూడా ఇటీవలే మృతి చెందాడు.  దాంతో కోడలు, జయలక్ష్మి వారి ఇద్దరు పిల్లల బాధ్యత కూడా లక్ష్మి చూసుకుంటోంది. ఈ క్రమంలో తన అత్త మరణ వార్త విన్న ఆమె కోడలు జయలక్ష్మి తనకు, తన పిల్లలకు దిక్కెవరంటూ విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 

ఒంటరైన కుటుంబం 

ఎక్కిరాల సుజాత(35) కూడా కూలీ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందగా.. ఆమెకు ఇద్దరు పిల్లలు శైలజ, సాయిచ భర్త శ్రీనివాస్‌ ఉన్నారు. ఆమె మృతితో కుటుంబసభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. 

శోకసంద్రంలో కుటుంబం

కత్తి సాయమ్మ(55)కు  నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిదీ రెక్కాడితే గాని డొక్కొడని కుటుంబం. భర్త కూడా కూలీపనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. కు టుంబంలో నలుగురు కూతుళ్లకు వివాహాలు అవగా.. కు మారుడికి పెళ్లి కాలేదు.  ప్రమాదంలో సాయమ్మ చనిపో వడంతో ఆ కుటుంబంలో  శోక సంద్రంలో మునిగింది.

పలువురి నాయకుల పరామర్శ..

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, బంధువులను, గాయాలపాలైన వారిని పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, క్షతగ్రాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంతఘోరప్రమాదం జరిగినా  ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, కనీసం తహసీల్దార్‌ స్థాయి అధికారి కూడా పరిస్థితిని పర్యవేక్షించకపోవడంపై మండిపడ్డారు. భద్రాద్రి జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్‌పాషా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య, నాయకులు అన్నవరపు సత్యనారాయణ, కనకయ్య తదితరులు ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. 

న్యాయం చేయాలని అర్ధనగ్నంగా జట్పీటీసీ ఆందోళన

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, అతివేగాన్ని నియంత్రిచకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ  చండ్రుగొండ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి అర్ధనగ్నంగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.  ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తేనే ఆందోన విరమిస్తామని పోలీసు అధికారుకు ఆందోళకారులు తేల్చిచెప్పారు. దీంతో ఆర్డీవో స్వర్ణలత సంఘటనా స్థలానికి చేరుకొని వారితో చర్చలు జరిపి నలుగురు మృతుల కుటుంబాలకు రూ.50 వేలు తక్షణ సాయంతో పాటు సింగరేణిలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.  

Updated Date - 2022-01-29T05:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising